Monday, July 8, 2024
Homeపాలిటిక్స్Harisha Rao: డిక్లరేషన్ పేరుతో మోసం, పబ్లిక్ సెల్ఫ్ డిక్లరేషన్ ఎప్పుడో చేసుకున్నారు

Harisha Rao: డిక్లరేషన్ పేరుతో మోసం, పబ్లిక్ సెల్ఫ్ డిక్లరేషన్ ఎప్పుడో చేసుకున్నారు

జమిలి, జంబ్లింగ్ ఏం చేసినా గెలుపు బీఆర్ఎస్ దే

పాలకుర్తి ప్రెస్ మీట్ లో మంత్రి హరీశ్ రావు కొందరు డిక్లరేషన్ పేరిట మోసం చేస్తున్నారని భగ్గుమన్నారు. ప్రజలు ఇప్పటికే సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నారని, ఎవరు ఎన్ని ట్రిక్కులు వేసినా హ్యాట్రిక్ కొట్టేది బిఆర్ఎస్ అంటూ ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. దేశంలో బిజెపి పరిస్థితి బాగోలేదని, ఓడిపోతం అని భయం ఆ పార్టీని పట్టి పీడిస్తోందన్నారు హరీష్ రావు. తెలంగాణలో ఈసారి ఆ పార్టీకి ఒక్క సీట్ కూడా వస్తుందో రాదో అనే డౌట్ పార్టీ అధిష్టానానికి ఉందన్నారు. బీజేపీకి దక్షిణ రాష్ట్రాల్లో గడ్డు పరిస్థితులున్నాయన్నారు. అందుకే జమిలి డ్రామాలు తెరలేపారని, దక్షిణాది రాష్ట్రాలపై బిజెపి చిన్నచూపు, వివక్ష జమిలి ఎన్నికలపై వేసిన కమిటీలో దక్షిణాది నుండి ఒక్కరూ లేకపోవటమే ఇందుకు నిదర్శనమన్నారు. జమిలి చేసినా జంబ్లింగ్ చేసినా గెలుపు పక్కాగా బి ఆర్ ఎస్ పార్టీదేనని. దేశ రాజకీయాల్లో బి ఆర్ ఎస్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని హరీష్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News