ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 19.95 శాతం ఓటింగ్ నమోదయింది. చలి కారణంగా ఓటర్లు నెమ్మదిగా పోలింగ్ బూత్ లకు వస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అతిశీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, కీలక నేతలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మరోవైపు పోలింగ్ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా కీలక సూచన చేశారు. ‘ఢిల్లీలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లందరూ పాల్గొనాలి. ప్రజాస్వామ్యం ఇచ్చిన అత్యంత విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలి. తొలిసారి ఓటు వేయబోతున్న యువ మిత్రులకు అభినందనలు. గుర్తుంచుకోండి తొలుత ఓటు వేయండి… ఆ తర్వాత రిఫ్రెష్ అవ్వండి’ అని ట్వీట్ చేశారు.
అలాగే కేజ్రీవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు ట్విటర్ వేదికగా ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రియమైన ఢిల్లీ వాసులారా.. ఈరోజు ఓటు వేసేరోజు.. మీ ఓటు కేవలం ఒక బటన్ కాదు.. అది మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది అంటూ పేర్కొన్నారు.