Monday, July 8, 2024
Homeపాలిటిక్స్Husnabad: ప్రతిపక్షాలకు దడ పుట్టిస్తున్న గులాబీ ప్రచారం

Husnabad: ప్రతిపక్షాలకు దడ పుట్టిస్తున్న గులాబీ ప్రచారం

వాడవాడలా గులాబీ దండు ప్రచార హోరు

హుస్నాబాద్ నియోజకవర్గాన్ని గులాబీ సైన్యాలు చుట్టుముట్టాయి. ఎక్కడచూసినా గులాబీ జెండాల రెపరెపలు… గులాబీ ఆట, పాటల హోరు కనిపిస్తోంది.. గులాబీ సైనికుల పదఘట్టనలతో.. నియోజకవర్గం దద్దరిల్లుతోంది. ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మూడోసారి విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో అయన ఎన్నికల ర్యాలీలు, ప్రచారం పూర్తి చేసారు. అభివృద్ధి, సంక్షేమం నినాదంతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే సి ఎం కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించారు. గ్రామగ్రామాన పెద్ద ఎత్తున డోర్ టూ డోర్ ప్రచారం గులాబీ పార్టీ నిర్వహిస్తోంది. ఈనెల 8 న సతీష్ కుమార్ నామినేషన్ వేయనున్నారు. మాజీ ఎమ్మెల్యే ఇనుగాల పెద్ది రెడ్డి ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సతీష్ కుమార్ తనయుడు ఇంద్రనీల్ గ్రామాల్లో పర్యటిస్తూ.. క్షేత్ర స్థాయి కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.

- Advertisement -

గులాబీ బలమిదే

గత పదేళ్లుగా హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ హుస్నాబాద్ ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. ఏ పార్టీకి లేని బలం, బలగం గులాబీ పార్టీకి ఉన్నాయి. 50 వేల మంది క్రియాశీల కార్యకర్తలు ఆ పార్టీకి ఉన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా బీ ఆర్ ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. 90 వేల మంది రైతుబంధు లబ్ధిదారులు, 50 వేల మంది ఆసరా పింఛన్ లబ్దిదారులున్నారు. అలాగే 12 వేల కల్యాణలక్ష్మి పథకం లబ్దిదారులున్నారు. ఇవి కాకుండా ఇతర పథకాల లబ్దిదారులున్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సతీష్ కుమార్ తీర్చిదిద్దారనే ప్రచారం ఉంది. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి జలాలు మెట్ట ప్రాంతానికి తీసుకువచ్చారని పేరుంది. గడచిన పదేళ్లలో హుస్నాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలు జరగడంతో పాటు ప్రత్యేక గుర్తింపు వచ్చాయి. హుస్నాబాద్ లో శాంతియుత వాతావరణం నెలకొల్పారనే పేరు సతీష్ కుమార్ కు ఉంది. అలాగే.. ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటారని అందరూ చెప్తుంటారు. ఈ అంశాలు గులాబీ పార్టీకి ప్లస్ గా ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ పార్టీ ప్రచారం ప్రతిపక్షాలలో దడ పుట్టిస్తోంది.

ప్రతిపక్షాల బలహీనతలు

హుస్నాబాద్ లో కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే, ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంకు చైర్మన్ అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తన ప్రచారం కూడా మూడు నెలల క్రితమే ప్రారంభించారు. కానీ అనూహ్యరీతిలో తెరపైకి వచ్చిన కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ తెరమీదకి వచ్చి టికెట్ దక్కించుకున్నారు. ఇటీవలే ప్రవీణ్ రెడ్డిని పిలిచి అధిష్టానం సర్దిచెప్పింది. కానీ లోలోపల అయన కు సంబంధిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పొన్నం కు మద్దతు నిచ్చేది లేదని, ఆయనకు మద్దతునిస్తే.. భవిష్యత్తులో తమకు గుదిబండలా మారుతాడని తెగేసి చెప్తున్నారు. పొన్నంకు ఇక్కడ నాయకులు గాని, కార్యకర్తలు గాని లేరు. ఆయనకు పదేళ్ల గ్యాప్ రావడంతో పాటు కొత్త ఓటర్లు రావడం ప్రతికూలంగా మారింది. కాగా. కాంగ్రెస్ పార్టీ హయాంలో హుస్నాబాద్ లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, బీ ఆర్ ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని గులాబీ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇదిలాఉంటె.. కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి పెద్ద స్పందన రావడం లేదు.. గ్రామాల్లో వృద్దులు, వికలాంగులు, రైతులు, మహిళలు తాము బీ ఆర్ ఎస్ పార్టీ, కారు గుర్తుకే ఓటేస్తామని తెగేసి చెప్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ బీ ఆర్ ఎస్ నాయకులను చేర్చుకుని హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నా.. ప్రజల నుండి పెద్దగా స్పందన రావడం లేదు. ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ మరింత బలహీన పాడడం ఖాయమని ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి.

అడ్రస్ లేని బీజేపీ

మెజారిటీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ హుస్నాబాద్ లో అభ్యర్థిని మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. హుస్నాబాద్ లో బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయనే ప్రచారం జరుగుతోంది. మొన్నటి దాకా.. హుస్నాబాద్లో పోటీ చేస్తానని ప్రకటించిన జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి పోటీ నుండి తప్పుకున్నాడని, గజ్వేల్ లో ఈటల రాజేందర్ కోసం పనిచేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయన కార్యాలయం గత నెల రోజులుగా మూసి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే బొమ్మే వెంకన్న తనయుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి టికెట్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ప్రచారం పెద్దగా ఎక్కడ కనిపించడం లేదు. ఏదిఏమైనా లబ్ధిదారుల ఓట్లు, పార్టీ బలం, బలగంతో.. గులాబీ పార్టీ అభ్యర్థి వొడితల సతీష్ కుమార్ ఎన్నికల్లో మూడోసారి విజయం దిశగా దూసుకుపోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News