హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నిక అంటే ఎప్పుడూ ఉత్కంఠ భరితమే. ఈటల బీఆర్ఎస్ వీడటంతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా హుజురాబాద్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల రాజేందర్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడి రాజకీయ పరిణామాలన్నీ ఆసక్తికరంగా మారిపోయాయి. ఉపఎన్నికల సమయంలో కూడా దేశవ్యాప్తంగా అందరి చూపును ఈ నియోజకవర్గం ఆకర్షించింది. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కూడా తనదైన శైలిలో నియోజకవర్గంలో దూసుకుపోతున్నాడు. బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మరింత దూకుడు పెంచి ప్రజల్లో మమేకమవుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు.
హుజరాబాద్ లో మినీ స్టేడియంతో పాటు జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పంపిణీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఇక్కడి ప్రజలలో నమ్మకాన్ని చూరగొన్నాడు. బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ కు హుజురాబాద్ నియోజకవర్గం మీద గతంలో పట్టు ఉన్నప్పటికీ ఉప ఎన్నికల్లో గెలిచిన అనంతరం నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో ప్రజల నుంచి కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇక ప్రణవ్ విషయానికి వస్తే నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉండి గత కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ లో చేరడంతో హుజురాబాద్ లో రాజకీయ చర్చ మొదలైంది. ఈసారి హుజురాబాద్ నియోజకవర్గంలో గెలిచేది ఎవరంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తూ తన మాటలతో నియోజకవర్గ ప్రజల దగ్గర మెప్పు పొందుతున్నాడు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, మరోవైపు తాను నియోజకవర్గానికి చేయబోతున్న అంశాలను వివరిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. దీంతో పాటు గెలిచిన తర్వాత రూ,1000 కోట్లతో హుజురాబాద్ ను మరో సిద్దిపేటలాగా తీర్చిదిద్దుతానని చెప్పడంతో ప్రజలు కూడా ఒకసారి కౌశిక్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ తన 6 గ్యారంటీల మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నం చేసింది. ఇంతలోనే బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కొత్త మేనిఫెస్టో తీసుకురావడంతో కాంగ్రెస్ అంచనాలన్నీ తారుమారయ్యాయి. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకంటే బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన కొత్త మేనిఫెస్టోలో పథకాలే బాగున్నాయంటూ జనాలు బిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అదేస్థాయిలో పాడి కౌశిక్ రెడ్డి కూడా కేసీఆర్ ప్రవేశపెట్టిన కొత్త మానిఫెస్టోను ప్రజలకు తనదైన శైలిలో వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు.
కౌశిక్ రెడ్డితో పాటు తన కుటుంబ సభ్యులైన భార్య శాలిని రెడ్డి, కూతురు శ్రీనిక రెడ్డి కూడా ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఒకవైపు కౌశిక్ రెడ్డి తన పదునైన మాటలతో ఓటర్ల మనుషులు గెలుస్తుంటే మరోవైపు కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి కూడా తన మాటలతో నియోజకవర్గ ప్రజలను మెప్పిస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా మీతోనే ఉంటున్నాం అంటూ తను కూడా ఒక అవకాశం ఇవ్వాలని కోరుతూ అవకాశం ఇచ్చి గెలిపిస్తే తాను కూడా భర్త వెంటే ఉంటూ ప్రజల సేవ చేసుకుంటానని అభ్యర్థిస్తున్నాను. ఓటు తన భర్త కౌశిక్ రెడ్డికే వేయాలంటూ మాట్లాడడంతో చాలామంది మహిళలు మద్దతు పలుకుతున్నారు. ఇక కౌశిక్ రెడ్డి కూతురు శ్రీనిక రెడ్డి కూడా ఒక్కసారి మా డాడీకి ఓటెయ్యండి ప్లీజ్ అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మా డాడీ ప్రతి గ్రామాన్ని హైదరాబాదుల తీర్చి దిద్దుతాడని చెప్పడంతో ప్రజలంతా ఆ పాప మాటలకు ముగ్దులైపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత రెండు నెలల నుంచి అలుపు అనేది లేకుండా తిరగడంతో ప్రజలలో అనూహ్య స్పందన వస్తుంది. ప్రచార సమయంలో వచ్చే స్పందనతో పాటు చాలా మంది ఈ ఒక్క సారి కౌశిక్ రెడ్డికి అవకాశం ఇవ్వాలంటూ చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది.
వెరసి ఇప్పుడు నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్లిన ఒకటే మాట వినబడుతుంది గతంలో ఏడు పర్యాయాలు ఇక్కడి నుంచి గెలిపించుకున్న ఈటల రాజేందర్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని కౌశిక్ రెడ్డికి నియోజవర్గానికి ఏదో చేయాలని తాపత్రయంగా ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాలు తమ పూర్తి మద్దతు ఇస్తూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డికి ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నట్లు బహిరంగ ప్రకటన కూడా చేశాయి. గ్రామాలతో పాటు కొన్ని కుల సంఘాలు, మత సంఘాలు కూడా ఇప్పటికే తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఇంతే కాకుండా తన ప్రసంగంలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని మరి అభివృద్ధి చేస్తాననడంతో ఆ గ్రామాలు కూడా కౌశిక్ రెడ్డికి జై కొడుతున్నాయి. వీటితో పాటు బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ అండదండలు ఉండడంతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ప్రజలు కూడా ఒకసారి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారనే మాట బలంగా వినిపిస్తుంది. హుజురాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరవేసి పాడి కౌశిక్ రెడ్డి హుజురా’బాద్ షా’ గా చరిత్ర సృష్టించబోతున్నారని నియోజకవర్గంలో జోరుగా బెట్టింగులు సాగుతుండటం హైలైట్.