Sunday, September 8, 2024
Homeపాలిటిక్స్Hyd: సాయంత్రం సీఎల్పీ భేటీ, రేవంత్ సీఎం

Hyd: సాయంత్రం సీఎల్పీ భేటీ, రేవంత్ సీఎం

రేవంత్ సీఎం అంటూ అధికారిక ప్రకటనే తరువాయి

ఈ సాయంత్రం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ భేటీ జరుగనుంది. ఈ భేటీలో సీఎల్పీ నేతగా, కొత్త సీఎంగా రేవంత్ రెడ్డిని ఎన్నుకోనున్నారు. కాగా ఇప్పటికే రేవంత్ తన సొంత నియోజకవర్గం కొడంగల్ తోపాటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై ఆధిక్యం కొనసాగిస్తున్నారు.

- Advertisement -

రేవంత్ ను కలిసిన డీజీపీ..

ఇక మరోవైపు డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ ఇప్పటికే రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. అంజనీ కుమార్ తోపాటు పలువురు ఐపీఎస్ లు రేవంత్ ను కలిసి, పుష్పగుచ్చం అందింజి, శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో కాబోయే సీఎం రేవంత్ అని స్పష్టమవుతుండగా ఇక అధికారికంగా, ఫార్మల్ గా ఈ విషయాన్ని ప్రకటించటమే తరువాయి.

ర్యాలీగా గాంధీ భవన్ కు..

నిన్నటి నుంచి హైదరాబాద్ లోనే మకాం పెట్టారు కర్నాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఎదిగిన డీకే శివకుమార్.. తెలంగాణ కాంగ్రెస్ ను ముందుండి నడుపుతూ వచ్చారు. చివరి అంకం దాకా పార్టీలో అన్నీ తానై కాంగ్రెస్ పార్టీని నడిపించిన డీకే ఇప్పుడు రేవంత్ తో కలిసి ర్యాలీగా గాంధీ భవన్ చేరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News