Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Hyd: BRS విస్తృతస్థాయి సమావేశం అందుకేనా

Hyd: BRS విస్తృతస్థాయి సమావేశం అందుకేనా

ఈనెల 10వ తేదీ అంటే రేపు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన.. బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటి పార్టీ సహా, రాష్ట్ర కార్యవర్గ.. సంయుక్త సమావేశం జరుగనుంది. ఈ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు , జిల్లా పరిషత్ చైర్మన్ లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ లు, డిసిఎమ్ఎస్, డి సి సి బి చైర్మన్ లు పాల్గొంటారు.
పైకి చెప్పేందుకు మాత్రం.. ఇది ఎన్నికల సంవత్సరమైన నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ కార్యకలాపాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్టు చెబుతున్నా కవితను ఈడీ అరెస్టు చేయటం ఖాయం కావటంతోనే ఈ ఎమర్జెన్సీ మీటింగ్ అని బీఆర్ఎస్ నేతలే చర్చించుకుంటున్నారు.
ఆహ్వానితులు ప్రతీఒక్కరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని అధినేత సిఎం కేసీఆర్ ఆదేశించటంలో ఆంతర్యం ఇదేనంటూ బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ కీలక నేతలంతా ముందస్తుగా నిర్ణయమైన తమతమ కార్యక్రమానలు వదిలేసి మరీ హైదరాబాద్ లోని ఈ కీలక భేటీకి అటెండ్ అవుతున్నారు.

- Advertisement -

MLC కవిత కు ED నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తన జర్మనీ పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకొని హైదరాబాద్ కు హుటహుటిన ప్రయణమయ్యారు రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్ గౌడ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News