Friday, April 4, 2025
Homeపాలిటిక్స్Hyd: గిరిజన బంధు ఇస్తాం..మంత్రి సత్యవతి రాథోడ్

Hyd: గిరిజన బంధు ఇస్తాం..మంత్రి సత్యవతి రాథోడ్

దేశ వ్యాప్తంగా కేంద్రం గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ కన్నా తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బీజేపీకి ప్రేమంతా ఎన్నికలు, అధికారంపైనే కానీ పేద ప్రజలపై లేదని.. సత్యవతి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గొంతుపెంచి మాట్లాడితే అబద్ధం నిజం కాదని.. రేవంత్ రెడ్డికి సోయి ఉంటే, చేతనైతే కేంద్రంపై పోరాటం చేయాలన్నారు. మేడారం జాతరకు బీఅరెస్ నాలుగేళ్ళ పాటు ఇచ్చిన నిధులు…కాంగ్రెస్ జీవితకాలంలో ఇవ్వలేదన్నారు ఆమె. సమయం వచ్చినప్పుడు గిరిజన బంధు ఇస్తామని..సీఎం కేసీఆర్ కు గిరిజనులంటే ఇష్టమని ఆమె వెల్లడించటం విశేషం. ఈమేరకు బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్, విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, హరిప్రియ నాయక్ మీడియాతో మాట్లాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News