Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Hyd: విపక్షాలపై లీగల్ చర్యలు, హెచ్చరించిన పల్లా, గండ్ర, సండ్ర, వివేకా

Hyd: విపక్షాలపై లీగల్ చర్యలు, హెచ్చరించిన పల్లా, గండ్ర, సండ్ర, వివేకా

గత మూడు రోజులుగా రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయని, యాసంగిలో దేశంలోనే ఎక్కువ పంట తెలంగాణలో సాగవుతోందని, అకాల వర్షాలతో పంట నష్ట పోవడం దురదృష్టకరమన్నారు రైతు బంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాణేశ్వర్ రెడ్డి. వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని సీఎం ఆదేశాల మేరకు తాము ప్రత్యక్షంగా పరీశీలించినట్టు.. 80 వేల మంది రైతులకు సంబంధించి లక్షా 50 వేల ఎకరాల పంట నష్టం జరిగిందని జిల్లా కలెక్టర్లు ఇప్పటికే నివేదికలు ఇచ్చారని పల్లా వెల్లడించారు.
రాష్ట్రం లో 2603 వ్యవసాయ క్లస్టర్లున్నాయని, క్లస్టర్ల వారీగా నివేదికలు రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. తుది నివేదికలు వచ్చాక ప్రభుత్వం రైతులకు భరోసా ఇచ్చి ఆదుకునే చర్యలు చేపడుతుందని పల్లా వివరించారు.

- Advertisement -


నిరుద్యోగులు మనో స్థైర్యాన్ని కోల్పోవద్దని, పరీక్ష రాసే వారెవ్వరికీ నష్టం వాటిల్లకుండా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు ప్రకటించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. లీకేజీలు గుర్తించి పబ్లిక్ సర్వీస్ కమీషన్ తప్ప ప్రతిపక్షాలు కాదని, చదువు రాని ప్రతిపక్ష నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని.. చదువుకున్న bsp నేత ప్రవీణ్ కుమార్ వారి లాగే మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శి గా ఉన్నపుడు తమ ప్రజా ప్రత్రినిధులు ఉద్యోగాల కోసం రికమెండ్ చేశారా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ktr ను అప్రదిష్ట పాలు చేసేందుకు ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారని, ప్రతిపక్షాలు దుష్ప్రచారం మానక పోతే లీగల్ నోటీసులు ఇస్తామన్నారు ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి. ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ స్పీడ్ ను ఆపలేరంటూ.. ఎమ్మెల్యేలు పల్లా, గండ్ర, సండ్ర, వివేకా గర్జించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News