మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు (కూతురి కొడుకు) అయిన చల్లా వెంకట్రామిరెడ్డి తొలుత పుల్లూరు గ్రామ ప్రెసిడెంట్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం చల్లా వెంకట్రామిరెడ్డి 2004 నుంచి 2009 వరకు అలంపూర్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. గత ఏడాది డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో చల్లా వెంకట్రామిరెడ్డికి సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు.
- Advertisement -
ఈ నెల తొమ్మిదిన ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ నామినేషన్ పత్రాలు చల్లా సమర్పించనున్నారు.