MK Stalin: బిహార్ లో రాజకీయం వేడెక్కింది. అక్కడ త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు మద్దతుగా తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ బిహార్ లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొనేందుకు ఆయన అక్కడి వెళ్లారు. కాగా.. ఇలాంటి సమయంలో స్టాలిన్ కు బీజేపీ గట్టి సవాల్ విసిరింది. గతంలో డీఎంకే నేతలు సహా స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుంది. ఆయన పార్టీ నేతలు గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ తెరపైకి తెచ్చింది. తమిళనాడు కాషాయ పార్టీ నేతలు ఆయనపై విమర్శలు గుప్పించారు. “బిహార్ యాత్రలో పాల్గొంటున్న తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మేమొక సవాల్ విసురుతున్నాం. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ మీ కుమారుడు చేసిన వ్యాఖ్యలను అక్కడి ప్రజల ముందు ప్రస్తావించే ధైర్యం మీకుందా? అలాగే, బిహారీలను తక్కువ చేస్తూ మీ బంధువు, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యల గురించి అక్కడ మాట్లాడగలరా?” అని తమిళనాడు కమలం పార్టీ నేత నారాయణన్ తిరుపతి సూటిగా ప్రశ్నించారు. ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర మాజీ చీఫ్ కె.అన్నామలై కూడా ఇదే తరహా సవాల్ చేశారు.
Read Also: Modi: మోదీ డిగ్రీ వివాదం.. సీఐసీ ఆదేశాలపై హైకోర్టు స్టే
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు
బిహార్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ప్రజల ఓటు హక్కును అన్యాయంగా తొలగిస్తున్నారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టారు. 16 రోజుల పాటు సాగే ఈ యాత్ర, రాష్ట్రంలోని 25 జిల్లాల మీదుగా 1,300 కిలోమీటర్ల దూరం కొనసాగుతుంది. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ బహిరంగ సభతో ఈ యాత్ర ముగియనుంది. ఈ యాత్రలో ఇండియా కూటమి భాగస్వాములైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, వామపక్ష పార్టీల నాయకులు కూడా పాల్గొన్నారు.
Read Also: Stock market: రాణించిన ఐటీ షేర్లు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు..!


