Tuesday, September 17, 2024
Homeపాలిటిక్స్Kodangal: మద్దూరులో పట్నం ప్రచారం

Kodangal: మద్దూరులో పట్నం ప్రచారం

రేవంత్ ఓ గాలి మోటర్

కొడంగల్ మద్దూరు మండలం నందిపాడు, లక్కయ్యపల్లి మాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. ఆట పాటలతో పట్నంకు స్వాగతం పలికారు మహిళలు, రైతులు, యువకులు. కేవలం ఎన్నికలప్పుడు వచ్చి మభ్యపెడుతున్న
కాంగ్రెస్ వారి కల్లబొల్లి మాటలను నమ్మవద్దని పట్నం ప్రచారం చేశారు.

- Advertisement -

24 గంటల కరెంటు ఇచ్చే బిఆర్ఎస్ పార్టీ కావాలా మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలి. రోజూ మీమీ ఇంటి ముందు ఉండే నరేందర్ రెడ్డి కావాలా గాలి మోటర్ లో తిరిగి 10 ఏళ్లకు పది సార్లు కొడంగల్ మొహం చూడని రేవంత్ రెడ్డి కావాలా ఆలోచించుకోవాలని పట్నం అన్నారు. అభివృద్ధి చేసే టిఆర్ఎస్ పార్టీ కావాలా బెదిరించి దాడులు చేసి పైసలతో కొంటాం అంటున్న కాంగ్రెస్ కావాలా ప్రజలు ఆలోచించాలన్నారు. ఈనెల 22న కోసిలో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా దీవెనసభను పెద్ద ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పట్నం విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News