Thursday, July 4, 2024
Homeపాలిటిక్స్Mallapur: ఎంపీపీ,సింగిల్ విండో చైర్మన్ లకు చెక్

Mallapur: ఎంపీపీ,సింగిల్ విండో చైర్మన్ లకు చెక్

అవిశ్వాసంతో 'హస్త'గతం చేసుకునే స్కెచ్

శాసనసభ ఎన్నికల తర్వాత మల్లాపూర్ మండలంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ కు చెందిన కల్వకుంట్ల సంజయ్ గెలవడం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు రాజకీయ ఎత్తులు వేస్తున్నారు. తమ పార్టీకి చెందిన వారికి ఎంపీపీ సింగిల్ విండో చైర్మన్లు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. మండలంలో ఇద్దరు సింగిల్ విండో చైర్మన్ లపై, ఎంపీపీపై అవిశ్వాసం పెట్టే యోచనలో అధికార కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం. పదేళ్లు తాము అనుభవించిన ప్రస్తుతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ద్వారా తమ చేయాలనుకున్న పదవిని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహం రచిస్తున్నారు. అందులో భాగంగా సింగిల్ విండో చైర్మన్లు అయ్యేందుకు టిఆర్ఎస్ పార్టీ అసంతృప్తి డైరెక్టర్లు, బిజెపి పార్టీకి చెందిన డైరెక్టర్లతో కలిసి అవిశ్వాసం పెట్టి అధికార పార్టీకి చెందిన వారికి చైర్మన్ పదవి, అసంతృప్త బిఆర్యస్ వారికి వైస్ చైర్మన్ ఇవ్వాలని చర్చించినట్లు, అలాగే ఎంపీపీ, వైస్ ఎంపీపీపై బిఆర్ యస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు గుర్రుగా ఉన్నారని, ఇదే మంచి తరుణంగా భావించి అసంతృప్తి ఉన్న నేతలతో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చర్చలు జరిపినట్లు, పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ కండువా కప్పుకొని ఎంపీపీ చేయాలని ఎంపీటీసీ ప్రయత్నిస్తున్నట్లు, అందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు మద్దతు తెలుపుతున్నారని అధికార పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, బీజేపీ ఎంపీటీసీలు, బి ఆర్ యస్ అసంతృప్త ఎంపీటీసీలతో కలిసి ఎంపీపీ, వైస్ ఎంపీపీని అవిశ్వాసం ద్వారా పదవి నుండి తొలగించాలని అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే సంజయ్ స్వంత మండలంలో అవిశ్వాసం రానుండటం, అవిశ్వాస ప్రక్రియను యువ ఎమ్మెల్యే ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News