Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Nandyala: దళిత రచ్చబండ ప్రారంభం

Nandyala: దళిత రచ్చబండ ప్రారంభం

ఎస్సీల సంక్షేమం పట్టని సర్కారు

రాష్ట్రంలో ఎస్సీల అబివృద్దికి, సంక్షేమానికి కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని నంద్యాల నియోజక వర్గ బిజెపి కన్వినర్ అభిరుచి మధు చెప్పారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎస్ సి మోర్చా విభాగం ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సుమారు 8 వేల గ్రామ పంచాయితీల అధ్వర్యంలో బస్తి సంపర్క్ అభియాన్ పేరుతొ కార్యక్రమాలను చేపటింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర స్థాయి దళిత రచ్చబండ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రాంభించారు.

- Advertisement -

అభిరుచి మధు నేతృత్వంలో..

నంద్యాలలో బిజెపి అసెంబ్లీ నియోజక వర్గ కన్వినర్ అభిరుచి మధు దళిత రచ్చబండ కరపత్రాలను విదుదల చేశారు. ఈ సందర్భంగా అభిరుచి మధు మాట్లడుతూ ..రాష్ట్రంలో ఎస్ సిల సమస్యలపై, వారి అభివృద్ధిపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, ఉద్యమాలు చేసిన రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వానికీ చలనం లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్రంలోని ఎస్సీ సమస్యలపై జగన్ ప్రభుత్వం స్పందించాలని అభిరుచి మధు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీలకు నిధులు మంజూరు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి ఎస్సీ మహిళా హోం మంత్రిగా ఉన్నా దళితులపై దాడులు, దౌర్జన్యాలు, అమానుష సంఘటనలు పెరిగిపోయాయని అభిరుచి మధు ఆవేదనే వ్యక్తం చేశారు. పోలీసుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 500 మంది బాధితులు కేసులు పెట్టినా ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో, ఈ ప్రభుత్వానికి ఎస్సీలపై ఉన్న అభిమానం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎస్సీలను, వారి అభివృద్దిని, వారి సంక్షేమం కోసం బిజెపి నేటి నుంచి రాష్ట్ర స్థాయి దళిత రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మధు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సి మోర్చా జిల్లా అద్యక్షులు భరణి రమేష్, లింగన్న, సంజీవుడు, బాలన్న, శ్రీరాములు, మహిళా మోర్చా నాయకురాలు చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News