మునిపల్లి రాబోయే ఎలక్షన్లో ప్రజలంతా ముచ్చటగా కాంగ్రెస్ పార్టీ దామోదర్ రాజనర్సింహని గెలిపించుకోవాలని మొగ్గు చూపిస్తుండటంతో ఆందోల్ రాజకీయాలు వాడివేడి మలుపులు తిరుగుతూ ఆసక్తిరేకెత్తిస్తున్నాయి. ఈ సందర్భంగా నాడు మండల కేంద్రమైన మునిపల్లిలో స్థానిక విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ దామోదర్ రాజనర్సింహ ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన రోజులను వీరంతా నెమరేసుకుంటున్నారు.
ప్రజల్ని ఆప్యాయంగా, మర్యాదపూర్వకంగా పలకరిస్తూ.. ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటున్న ఈయన ఇమేజ్ కు ఇక్కడ వచ్చిన ఢోకా ఏం లేదు. రాజ నరసింహ కూతురు త్రిష వర్షాలను సైతం లెక్కచేయకుండా గడప గడపకూ తిరుగుతూ పేద ప్రజలను ఓదార్చి, మనోధైర్యాన్ని నింపుతున్నారు. దామోదర్ పులిబిడ్డని, ఆయన మౌనాన్ని చిన్నచూపుగా చూస్తున్న స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కు తన గెలుపు మీద వందశాతం ధీమా లేదంటూ దామోదర్ రాజనరసింహ అభిమానులు చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనే దామోదర్ రాజనర్సింహకి పార్టీ గుర్తింపు ఇచ్చింది. పార్టీలో విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత కమిటీగా పరిగణించే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి) లో శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమితులాయ్యారు. ఆందోల్ నియోజకవర్గం నుంచి ఆయన 1989, 2004,2009, ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు వైయస్ హయాంలో రెండుసార్లు, రోశయ్య మంత్రివర్గంలో ఒకసారి మంత్రిగా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందారు. రాష్ట్ర కాంగ్రెస్లో సీనియర్ లీడర్ గా పేరున్న ఆయన రాష్ట్రంలోని ఎస్సీలలో మెజార్టీ వర్గమైన మాదిగ ఉపకులాలకి నాయకుడు.
ఇటీవల దామోదర్ పార్టీ మారుతున్నారన్న దుష్ట ప్రచారం నేపథంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీలోనే అత్యున్నత కమిటీలో శాశ్వత అహానిత సబ్బుడిగా పదవి దక్కడం గమనార్హం. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షుడు బుర్కల పాండు ఈ సందర్భంగా మునిపల్లి మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు పార్టీ నాయకులు నాయకులు అందరూ కలిసి పార్టీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున రాజనరసింహకు మద్దతుగా చేపడుతున్నారు.