గాయం కారణంగా సీఎం వైయస్ జగన్ గారిని విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన మేరకు ఈరోజు బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. కాసేపట్లో తదుపరి కార్యక్రమం వివరాలను వైసీపీ విడుదల చేయనుంది.
నిన్న రాత్రి కండ్రిక చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్ బస్సుయాత్రలో జగన్ పై రాయితో దాడి జరిగింది. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి జరిగింది. అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకిన రాయి, ఈ కారణంగా జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం ఏర్పడింది. సీఎం జగన్ పక్కనే ఉన్న MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయమైంది. వెంటనే సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు, ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగించారు జగన్.
విజయవాడలో సీఎం జగన్ కోసం పోటెత్తిన జనంతో సిటీలో మూడున్నర గంటలుగా అప్రతిహతంగా భారీ రోడ్ షో సాగింది. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డాయని విజయవాడ YSRCP నేతలు ఆరోపించారు. జగన్ గాయానికి కుట్లు కూడా పడ్డాయి.