Monday, November 25, 2024
Homeపాలిటిక్స్Jagan on election results: శకుని పాచికల్లా ఎన్నికల ఫలితాలు: జగన్

Jagan on election results: శకుని పాచికల్లా ఎన్నికల ఫలితాలు: జగన్

ఏం జరిగిందో దేవుడికే తెలియాలి

వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలనుద్దేశించి తన క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ మాట్లాడిన ముఖ్యమైన అంశాలు.

  • గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ చేయలేని విధంగా మంచి పరిపాలన అందించాం:
  • మేనిఫెస్టోలో 99శాతం హామీలు అమలు చేశాం.
  • ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా ఎవ్వరూ చేయలేదు.
  • చాలా చిత్తశుద్ధితో పనిచేసి, మేనిఫెస్టోను అమలు చేశాం.
  • ఏ నెలలో ఏం ఇవ్వబోతున్నామో క్యాలెండర్ ప్రకటించి మరీ అమలు చేశాం.
  • ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ, ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు మంచి చేశాం.
  • విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఎప్పుడూ చూడని సంస్కరణలు తీసుకొచ్చాం.
  • ప్రజల ఇంటివద్దకే పరిపాలనను తీసుకెళ్లాం.
  • అవినీతికి చోటులేకుండా, వివక్ష చూపకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశాం. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందించాం.
  • విద్యారంగంలో మనం తీసుకొచ్చిన సంస్కరణలతో పేదరిక నిర్మూనలదిశగా అడుగులు వేశాం.
  • భవిష్యత్తు తరాలను ప్రపంచస్థాయిలో నిలబెట్టేందుకు ఇంగ్లిషు మీడియం, టోఫెల్, ఆరో తరగతి నుంచి డిజిటల్ టీవీలు, ఎనిమిదో తరగతి నుంచి ట్యాబులు అందించాం.
  • ఐబీ సిలబస్‌ని కూడా తీసుకు వచ్చాం.
  • ప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను విద్యార్థులకు అందించాం.
  • నాణ్యమైన విద్యను శాశ్వతంగా అందించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించే దిశగా ఐదేళ్లలో అడుగులు వేశాం.
  • సోషల్ ఇంజినీరింగ్‌లో భాగంగా ఎప్పుడూ చూడనివిధంగా వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశాలు కల్పించాం.
  • ఇన్ని గణనీయమైన మార్పులు తీసుకువచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయంటే చాలా ఆశ్చర్యమేస్తోంది.
  • శకుని పాచికలు మాదిరిగా ఈ ఎన్నికలు ఫలితాలు వచ్చాయనిపిస్తోంది.
  • ఏం జరిగిందో దేవుడికే తెలియాలి.
  • ల్యాండ్ టైట్‌లింగ్‌ యాక్ట్‌ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ మద్దతు పలికింది.
  • అమెరికా, యూరప్ దేశాల్లో అనుసరిస్తున్న మంచి విధానాలన్నీ ఇందులో ఉన్నాయని సభ సాక్షిగా ప్రశంసలు కురిపించింది.
  • కాని, సరిగ్గా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను ఒక భూతంలా చూపి… టీడీపీ, కూటమి పార్టీలు విషప్రచారం చేశాయి.
  • నిజంగా ఈ చట్టాన్ని తీసుకురావాలంటే.. అంత సులభమైన విషయం కాదు.
  • వైయస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేలమంది సర్వేయర్లను నియమించడం వల్లే సాధ్యపడే పరిస్థితులు వచ్చాయి.
  • భూమి కొనాలన్నా, అమ్మాలన్నా.. మోసాలకు ఎలాంటి ఆస్కారం లేని పరిస్థితులు ఈ చట్టంవల్ల వస్తాయి.
  • చరిత్రలో తొలిసారిగా భూ పత్రాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది.
  • ఈ పత్రాల విషయంలో తప్పులు జరిగితే… సదరు వ్యక్తికి ప్రభుత్వమే పరిహారం ఇస్తుంది.
  • టీడీపీ వాళ్లు మద్దతు పలికిన చట్టాన్ని ఇప్పుడు వాళ్లే తీసేస్తామంటున్నారు. వారి చేస్తున్న రాజకీయాలు ఎలా ఉంటాయో దీనిబట్టే తెలుస్తుంది.
  • వైయస్సార్సీపీని నమ్మకుని కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి.
  • కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఈ పార్టీపై ఆధారపడి ఉన్నారు.
  • కొన్ని వేలమంది నాయకులు పార్టీలో ఉన్నారు.
  • అనుకున్న లక్ష్యాల దిశగా పార్టీ ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది.
  • ఈ ఎన్నికల్లో మనకు 40శాతం ఓట్లు వచ్చాయి.
  • గడచిన ఎన్నికలతో పోలిస్తే 10 శాతం ఓట్లు తగ్గాయి.
  • రానున్న రోజుల్లో ఈ 10శాతం ప్రజలే… మన పాలనకు, ఇప్పటి ప్రభుత్వం పాలనకు తేడాను గుర్తిస్తారనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయి.
  • ప్రతి ఇంట్లోకూడా మన ప్రభుత్వం చేసిన మంచి ఉంది.
  • ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదు.
  • మనలో పోరాటపటిమ తగ్గకూడదు.
  • నా వయసు చిన్నదే. నాలో సత్తువ ఇంకా తగ్గలేదు.
  • 14 నెలలు పాదయాత్ర చేశాను. దేవుడు దయ వల్ల అన్నిరకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉంది.
  • ప్రజలు మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకు వస్తారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి.
  • పార్లమెంటులో మనకు 11 మంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు.
  • మొత్తంగా 15 మంది ఎంపీలు మన పార్టీకి ఉన్నారు. టీడీపీకి 16 మంది ఉన్నారు.
  • అందువల్ల మన పార్టీకూడా చాలా బలమైనదే. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు.
  • మనం ధైర్యంగా ఉండి ప్రజల తరఫున పోరాటం చేయాలి.
  • 2019-24 మధ్య ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు మన పరిపాలనాకాలం ముగిసిందో తెలియదు. ఈసారికూడా అంతే. ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయి.
  • పార్లమెంటులో వ్యవహరించేటప్పుడు ప్రజాహితమే ధ్యేయం కావాలి.
  • రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంశాలవారీగానే మద్దతు ఉంటుంది.
  • ఎవరికైనాగాని, అంశాలవారీగానే మద్దతు ఉంటుంది.
  • పార్టీ విధివిధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలి.
  • ప్రజలముందు తలెత్తుకునేలా పార్లమెంటులో ఎంపీలు ముందుకుసాగాలి.
  • రాజకీయంగా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికం.
  • మన పరిపాలనను, చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారు.
  • కచ్చితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయి.
  • ఈలోగా మనం ధైర్యాన్ని కోల్పోకూడదు.
  • విలువలు, విశ్వసనీయతతో ముందడుగులు వేయాలి.
  • ఇదివరకటి లాగానే రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారు.
  • లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథన్ రెడ్డి వ్యవహరిస్తారు.
  • పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారు.
  • అందరికీ నేను అందుబాటులో ఉంటాను.
  • ఎంపీలంతా కలిసి కూర్చుని చర్చించుకుని ఆ మేరకు అడుగులు ముందుకేయాలి.
  • పార్టీపరంగా వ్యవహరించాల్సిన అంశాలను పరస్పరం చర్చించుకుని, నిర్ణయాలు తీసుకోండి.
  • ఎంపీలుగా మీరు వేసే ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్టను పెంచేదిగా ఉండాలి.
  • మన పార్టీకి ఒక సిద్ధాంతం, గుర్తింపు ఉన్నాయి.
  • పార్టీ కోసం మీరు కష్టపడండి. పార్టీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News