తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ జాతీయ కౌన్సిల సభ్యులు మహబూబ్నగర్ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి తన దూకుడు పెంచారు. ఈసారి అసెంబ్లీకి దరఖాస్తు చేసుకుని ఎమ్మేల్యేగా కూడా గెలుపొంది తన సత్తా ఏమిటో నిరూపించుకోబోతున్నారు. అందుకే దుకూడు పెంచేశారు.
మహబూబ్ నగర్ అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పార్టీకి దరఖాస్తు చేసుకోవడం విశేషం.
జితేందర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడుగా 1999లో 13వ లోకసభకు భారతీయ జనతా పార్టీ తరపున మొట్ట మొదటిసారి ఎంపీగా గెలుపొందారు. ఆ తరువాత 2014లో 16వ లోకసభకు తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం పార్లమెంటు సభ్యుడిగా వహించారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు.
తాజాగా జితేందర్ రెడ్డి, కొత్త వ్యూహంతో అసెంబ్లీ పరిధిలోకి దిగబోతున్నట్లు స్పష్టం అయ్యింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీకి దరఖాస్తు చేసుకోవడంతో ఆయన బరిలో ఎమ్మెల్యే బరిలో నిలుస్తారని తేటతెల్లం అయింది. అసెంబ్లీ రాజకీయాల్లో జితేందర్ రెడ్డి మొదటిసారి అడుగుపెట్టనుండడంతో పలమూరు రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థుల ప్రకటనకు ముందు ఆశావహుల నుంచి దరఖాస్తులను బిజేపి అధిష్ఠానం స్వీకరిస్తోంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో ఆశావహుల నుంచి దరఖాస్తు స్వీకరణపై బీజేపీ అధిష్టానం ఆరా తీసింది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల లెక్కలను అడిగి తెలుసుకుంది. కీలక నేతల అప్లికేషన్లలో మొట్టమొదటిసారి బడా నాయకుడు దరఖాస్తు చేసుకోవడం విశేషం. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు అయిన ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, తదితరులంతా ఈనెల 9, 10 తేదీల్లో దరఖాస్తులు సమర్పించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. హైకమాండ్ హుకుం జారీ చేయడంతో మంచి ముహూర్తం కోసమే తాము వేచి చూస్తున్నామని పలువురు కీలక నేతలు చెబుతున్నారు. ఇటివలే బీజీపీలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు 63 మంది 182 అప్లికేషన్లు సమర్పించారు. కాగా రెండో రోజు 178 దరఖాస్తులు వచ్చాయి. అందులో కీలక నేతలెవరివీ లేకపోవడాన్ని అధిష్టానం గుర్తించింది. కొంతమంది నేతలు మూడు, నాలుగు నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నారు. మూడు రోజులు అప్లికేషన్లు భారీగానే వచ్చినా అష్టమి, నవమి కారణంగా 7, 8 తేదీల్లో అప్లికేషన్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 9, 10 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. 9న దశమి, 10వ తేదీన ఏకాదశి ఉన్న నేపథ్యంలో తొలుత వచ్చిన అప్లికేషన్ల కంటే భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండ్రోజుల్లోనే ఇంకా ముఖ్య నేతలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంబర్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌కు దరఖాస్తు చేసుకోనున్నారు. ఎంపీ లక్ష్మణ్ ముషీరాబాద్, డీకే అరుణ గద్వాల, ఈటల హుజురాబాద్, అర్వింద్ ఆర్మూర్, రఘునందన్ రావు దుబ్బాక, మాజీ ఎంపీ వివేక్ చెన్నూర్ సెగ్మెంట్ నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. కాగా విజయశాంతి, మురళీధర్ రావు, గరికపాటి మోహన్ రావు, చాడ సురేశ్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి దరఖాస్తు చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్ ప్రకాశ్ జవదేకర్.. మూడో రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోని అప్లికేషన్ సెంటర్‌ను పరిశీలించారు. అందరూ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని పార్టీ నేతలకు సూచనలు చేసిన సంగతి తెలిసిందే.
Jitendar Reddy: పాలమూరులో ‘జితేందరుడి’ వ్యూహం
అసెంబ్లీ బరిలో పోటీకి సై