సీఎం కేసిఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మోర్తాడ్ మండల కేంద్రం తుక్కూరి వాడకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ యువకులు, మిత్రాస్ యూత్ సభ్యులు, దొన్కల్ గ్రామం నుండి హనుమాన్ యూత్ అసోసియేషన్ యువకులు, కాంగ్రెస్ మాజి ఎంపిటిసి లక్ష్మి పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
బాల్కొండ మండలం చిట్టాపూర్ నుండి కింగ్స్ యూత్, మహా శక్తి,అంబేద్కర్ యూత్, పవర్ యూత్, గల్లీ బాయ్స్, వెపన్స్ యూత్, ఈగల్ యూత్, ప్రొఫెషనల్ యూత్, లినోస్ పవర్, షైనింగ్ స్టార్స్, వినాయక్ యూత్ లకు చెందిన నవీన్, రాజు, రాజేందర్, అన్వేష్,నరేష్, అశ్వానంద్, లడ్డు నవీన్, రఘు యూత్ సభ్యుల అధ్వర్యంలో సుమారు 300 మంది యువకులు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసిన వేములకే తమ సంపూర్ణ మద్దతు అంటూ మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న యువకులు నినాదాలు చేశారు. జై తెలంగాణ , జై కేసిఆర్, జై ప్రశాంత్ అన్న, ప్రశాంత్ అన్నకే మా ఓటు అంటూ యువకుల నినాదాలతో జాయినింగ్ ప్రాంగణమంతా మారు మ్రోగింది. అభివృద్ది వైపు ఉంటామనే యువత నిర్ణయం మంచి శుభపరిణామమని, తనకు వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని మంత్రి వేముల అన్నారు.
యువత ఆలోచన మంచి సమాజ నిర్మాణానికి నాంది అన్నారు. యువత బలం తోడైతే బాల్కొండలో అభివృద్ది పరుగులు పెడుతుందని మంత్రి తెలిపారు. వారికి హృదయ పూర్వక స్వాగతం పలికి,అన్ని సమయాల్లో అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.