Thursday, July 4, 2024
Homeపాలిటిక్స్Kothapalli: కరీంనగర్ మెడికల్ కాలేజ్ అడ్మిషన్లు ఈ ఆగస్టు నుంచే

Kothapalli: కరీంనగర్ మెడికల్ కాలేజ్ అడ్మిషన్లు ఈ ఆగస్టు నుంచే

కొత్తపల్లి మున్సిపల్ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర విత్తన గిడ్డంగుల సంస్థ విత్తన శుద్ది క్షేత్రంలో 7 కోట్ల రూపాయలతో ప్రభుత్వం నిర్మించనున్న వైద్య కళాశాల తాత్కాలిక భవన నిర్మాణ పనులకు మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ నిర్వహించారు. కరీంనగర్ లో రెండు ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నా నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించాలని ఆలోచనతో కరీంనగర్ జిల్లాకు కేసీఆర్ వైద్య కళాశాల మంజూరు చేశారని మంత్రి గంగుల అన్నారు. వీలైనంత త్వరగా వైద్య కళాశాల పనులు ప్రారంభించి ప్రవేశాల కోసం సిద్దం చేయాలని.. విత్తన శుద్ది క్షేత్రంలో గోదాంలో తాత్కాలిక భవన నిర్మాణానికి 7 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని తెలిపారు.

- Advertisement -

విత్తన శుద్ది క్షేత్రంలో మొత్తం నాలుగు గోదాం లతో పాటు 20 ఎకరాల స్థలాన్ని వైద్య కళాశాల కోసం కేటాయించినట్టు గంగుల వివరించా. నాలుగు గోదాముల్లో తరగతి గదులు, లైబ్రరీ, అనాటమీ ల్యాబ్, బయో కెమిస్ట్రీ ల్యాబ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిసియోలజీ, అడ్మినిస్ట్రేషన్, బ్లాక్ తాత్కాలిక భవన నిర్మాణ పనులు చేపట్టి ఆగస్టు నెలలో 100 మంది విద్యార్థులతో ప్రవేశాలు ప్రారంభింస్తున్నట్టు ఆయన తెలిపారు. శాశ్వత భవన నిర్మాణం ప్రస్తుతం టెండర్ దశలో ఉందని, టెండర్ పూర్తి కాగానే కేసీఆర్ భూమి పూజ చేయనున్నట్టు గంగుల తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News