Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Karimnagar: గంగులకు టికెట్, సంబరాల్లో మద్దతుదారులు

Karimnagar: గంగులకు టికెట్, సంబరాల్లో మద్దతుదారులు

గంగుల అభిమానుల్లో ఉరకలెత్తుతున్న ఉత్సాహం

ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు కోరుకుంటున్నారని… రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా మంత్రి గంగుల కమలాకర్ ను ప్రకటించారు. ఈ సందర్బంగా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గంగులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

కరీంనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా గంగుల కమలాకర్ ను ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈమేరకు నగరంలోని మీసేవ కార్యాలయంలో నాలుగోసారి టికెట్ అందుకున్న సందర్బంగా పలువురు పార్టీ శ్రేణులు గంగుల కమలాకర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా జిల్లా టైగర్ గంగుల కమలాకర్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ సునీల్ రావు పుష్పగుచ్చం అందిస్తూ… శుభాకాంక్షలు తెలిపారు. సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గంగులను కలిశారు. సీఎం హామీ మేరకు సిట్టింగ్ అందరికీ టికెట్లు కేటాయించారని… మంత్రి గంగుల అన్నారు. దేశ చరిత్రలో 100కు పైగా అభ్యర్థులను ప్రకటించడం సీఎం కేసీఆర్ కే సాధ్యమయ్యిందని చెప్పారు. కేసీఆర్ లేని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు ఊహించుకోలేమని తెలిపారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ కు ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నారని గుర్తుచేశారు. 90పై చిలుకు సీట్లతో గెలువనున్నామని చెప్పారు. రైతుబంధు, రైతు రుణమాఫీ లాంటి అనేక పథకాలతో బీఆర్ఎస్ ముందుకెళ్తుందన్నారు. హిందూ ముస్లీంలు కలిసి మెలిసి ఉన్నారని… 13కు 13సీట్లు గెలిచి కానుకగా అందిస్తామని తెలిపారు. కేసీఆర్ నిర్ణయించిన అభ్యర్థికే ప్రజలు ఓటు వేస్తారని… బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఇంటి పార్టీ అని చెప్పారు. 15 సంవత్సరాలుగా కరీంనగర్ లో సాఫీగా పాలన కొనసాగుతుందని… నియోజకవర్గాన్ని చాలా అభివృద్ది చేశామని తెలిపారు. అభివృద్ది కొనసాగేందుకు కేసీఆర్ పాలన మరోసారి రావాల్సిన అవసరముందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతోపాటు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News