“అల్ఫోర్స్“ నరేందర్ రెడ్డి ముఖాముఖి ప్రోగ్రాం లో భాగంగా ఆరోగ్యంగా జీవించడం వలన కార్యకలాపాలను చాలా ఉత్సాహంగా నిర్వర్తించవచ్చని విధులను చాలా సంతోషంగా నిర్వర్తిస్తామని కరీంనగర్- నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ నియోజక వర్గ పట్టభద్రుల ఎం.ఎల్.సి అభ్యర్థి “అల్ఫోర్స్” డా॥వి. నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక యస్.ఆర్.ఆర్ డిగ్రి & పి.జి కళాశాల మైదానంలో శనివారం ఉదయం వాకర్స్తో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని వ్యాయామం చేస్తున్నారని తెలుపుతూ వ్యాయామంలో అత్యంత కీలకమైన వాకింగ్కు చాలా మంది ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా దానిని వారి రోజువారి కార్యకలాపంగా చేసుకున్నారని తెలిపారు.
ముఖాముఖిలో భాగంగా వారు పలువురు వాకర్లతో సమావేశమై రాబోయె పట్టభద్రుల ఎం.ఎల్.సి ఎన్నికలలో మద్దతు తెలుపాలని కోరారు. పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తను ఎన్నికలలో పోటీ చేస్తున్నాననీ అన్నారు. విద్యారంగంలో అపార అనుభవం కల్గినవాడిగా జూనియర్ కళాశాలలు ఎదురుకుంటున్న పలు సమస్యలను పరిష్కరించడానికై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ ముఖాముఖిలో భాగంగా వారు వాకర్స్ అందరిని కలిసి వారి అభ్యర్థిత్వాన్ని తెలిపారు. అందుకు గాను వారందరు మీకే మద్దతిస్తామని హామి ఇవ్వడమే కాకుండా ప్రచారంలో సైతం ముందుంటామని మద్దతు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో పలు విద్యాసంస్థల యాజమాన్యాలు, సేవసంస్థల నిర్వాహకులు, యువజన సంఘాల నాయకులు, సుమారు 250 మంది వాకర్స్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొని వారి అభ్యర్థిత్వాన్ని తెలిపి ముందస్తుగా అభినందనలు తెలియజేశారు.