Wednesday, October 30, 2024
Homeపాలిటిక్స్Karimnagar: రచ్చ రచ్చగా జెడ్పీ మీటింగ్

Karimnagar: రచ్చ రచ్చగా జెడ్పీ మీటింగ్

మీటింగ్ లో తుఫానులా చెలరేగిన ఎమ్మెల్యే కౌశిక్

కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యవర్గ చివరి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఈ సమావేశంలో కౌశిక్ జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులపై మండిపడ్డారు పలు అంశాలపై నిలదీశారు. కౌశిక్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే అధికారులు వెళ్లిపోయారు. హుజురాబాద్ నియోజకవర్గం లో ఇటీవల జరిగిన ఎంఈఓల బాధ్యతల తొలగింపు అంశాన్ని లేవనెత్తారు.

- Advertisement -

ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో పాఠశాలల పనితీరుపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎంఈవోలు హాజరయ్యారు. ఈ సమావేశానికి ఎలా వెళ్తారు అంటూ డీఈవో ఎంఈఓ లకు నోటీసు జారీ చేశారు. అలాగే ఎంఈఓ లు ఇద్దరిని బాధ్యతలనుండి తొలగించారు. ఈ విషయమై కౌశిక్ రెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో జడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్ల ముందే గళమెత్తారు. ఒక ఎమ్మెల్యేగా సమీక్ష సమావేశం నిర్వహించే అర్హత తనకు లేదా అని ప్రశ్నించారు.

ఒక ఎమ్మెల్యేగా విద్యార్థులకు మంచి బోధన అందుతుందా లేదా? మధ్యాహ్న భోజనం ఇస్తున్నారా లేదా? యూనిఫారాలు పుస్తకాలు ఇచ్చారా లేదా? పాఠశాలలో సౌకర్యాలు ఉన్నాయా లేదా? అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు? ఈ విషయమే జిల్లాకు చెందిన మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించాల్సింది పోయి.. తాను సమీక్ష నిర్వహిస్తే అధికారులపై చర్యలు తీసుకోవడం ఏమిటని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విషయమై స్పీకర్ను కలిసి సభ్యుల హక్కుల ఉల్లంఘన పై నోటీసును అందజేస్తామని స్పష్టం చేశారు. స్పీకర్ కూడా స్పందించకుంటే కోర్టుకు వెళతానని హెచ్చరించారు. గతంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయమే కూడా తాను పంపిణీ చేయవద్దంటూ మంత్రి ఆదేశాలు జారీ చేశారని కానీ తాను ఈ విషయమై కోర్టుకు వెళ్లానని కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఎమ్మెల్యేలే చెక్కులు పంపిణీ చేయాలని చెప్పిందని ఆయన తెలిపారు.

కోపం ఉంటే తనపై తీర్చుకోవాలి కానీ నిరుపేదలైన లబ్ధిదారులపై కాదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. దళిత జడ్పిటిసి సభ్యుడైన శ్రీరామ్ ను దళిత బంధు డిమాండ్లపై టీ షర్టు వేసుకుని వచ్చాడు అన్న కారణం పై సభలోకి అనుమతించకపోవడం దారుణమని అతన్ని వెంటనే సభలోకి అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే దళిత బంధు నిధులను విడుదల చేయాలని కూడా కౌశిక్ అధికారులను డిమాండ్ చేశారు.

చిగురు మామిడి జెడ్పిటిసి సభ్యుడు గీకుడు రవీందర్ లేచి కౌశిక్ రెడ్డిని విమర్శించబోగా బి ఆర్ ఎస్ టికెట్ పై గెలిచి పార్టీ మారి ప్రశ్నిస్తున్నావా? నీకు మాట్లాడే హక్కు లేదు అంటూ కౌశిక్ మండిపడ్డారు. ఏది ఏమైనా జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశంలో కౌశిక్ రెడ్డి విశ్వరూపం చూపించడం సర్వత్ర చర్చనీయాంశం అయింది. అదను చూసి కౌశిక్ సరియైన అంశాలను ప్రస్తావించి అధికార పక్షాన్ని డిఫెన్స్ లోకి నెట్టారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News