Tuesday, September 17, 2024
Homeపాలిటిక్స్Karnataka: గృహిణిలందరికీ నెలకు రూ.2000: కాంగ్రెస్

Karnataka: గృహిణిలందరికీ నెలకు రూ.2000: కాంగ్రెస్

తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని గృహిణులందరికీ నెలకు రూ.2,000 ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మహిళా సాధికారతపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా పునరుద్ఘాటించారు. ఈమేరకు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ‘నా నాయకి’ అనే పథకం కింద మహిళలందరికీ ఆర్థికసాయం చేస్తే ఆ కుటుంబమంతా బాగుపడుతుందని ప్రియాంక అన్నారు. మహిళలంతా కలిసి దేశ రాజకీయాలను మార్చాలంటూ కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రియాంక పిలుపునిచ్చారు.

- Advertisement -

కర్నాటకలో 40శాతం కమీషన్లను అధికార బీజేపీనే నొక్కేస్తోందని, బీజేపీ పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిందన్న ప్రియాంక..ప్రస్తుత సర్కారును సాగనంపి, కాంగ్రెస్ కు పట్టం కడితే అంతా సంక్షేమమే అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ఎన్నికల్లో మహిళా మ్యానిఫెస్టోను ప్రత్యేకంగా ప్రకటించాలని, ఆ కార్యక్రమానికి తాను హాజరవుతానంటూ ఇప్పటికే డీకే శివకుమార్, సిద్ధరామయ్యకు మాట ఇచ్చానంటూ ఆమె వెల్లడించటం విశేషం. వుమెన్ మ్యానిఫెస్టోలో మరిన్ని స్కీములు ఉంటాయని ఆమె వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News