ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎటువంటి ఆధారాలు చూపకుండా జైలులో పెట్టారని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సనత్ నగర్ లోని జెక్ కాలనీలో ఏర్పాటు చేసిన నిరాహార దీక్షలో పాల్గొన్నారు. నిరసనకారులకు సంఘీభావాన్ని ప్రకటించారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమై కాలనీ అంతటా క్యాండిల్ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి 29 రోజులవుతున్నా ఎటువంటి ఆధారాలను ఏపీ ప్రభుత్వం కోర్టుకు సమర్పించలేదన్నారు. కుట్రపూరితంగా జైలులో పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును జైలు నుంచి విడుదల చేసే వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. అనంతరం టీడీపీ నాయకులు నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు ప్రజల అభివృద్ధి కోసం తెలుగు ప్రజల కష్టాలను తీర్చే నాయకుడు చంద్రబాబునాయుడు అని ఆయన అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు త్వరలోనే సైకో ప్రభుత్వం పోయి మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీపతి సతీష్, కాట్రగడ్డ ప్రసునా, ఫలహారం బండి మధు ముదిరాజ్, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Kasani: చంద్రబాబును విడుదల చేసే వరకు నిరసనలు
టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES