Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Katasani: 'నవరత్నాలే' విజయానికి పునాదులు

Katasani: ‘నవరత్నాలే’ విజయానికి పునాదులు

రాయలసీమలో టిడిపికి డిపాజిట్లు కూడా గల్లంతే

వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలే వైయస్ఆర్ సిపి విజయానికి పునాదులు అని వైయస్ఆర్ సిపి జిల్లాల అధ్యక్షులు, మేయర్ బి.వై. రామయ్య, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. 19వ వార్డు 47వ సచివాలయం నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీ, రాంనగర్ కాలనీల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు తాను పుట్టిన రాయలసీమకు తన 14 ఏళ్ళ పాలనలో చెప్పుకోదగ్గ ఒక్క పని చేయలేదని దుయ్యబట్టారు. 2014 ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో సీట్లు రాలేదనే ఏకైక దురుద్దేశంతో సీమపై నిర్లక్ష్యం ప్రదర్శించారని మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకొని సీమకు వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో టిడిపికి రాయలసీమలో డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమన్నారు.

- Advertisement -

ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ రాయలసీమపై చంద్రబాబు చిన్నచూపు చూసినందుకే గత ఎన్నికల్లో టిడిపికి ముచ్చటగా మూడు సీట్లతో ప్రజలు సరిపెట్టారని పేర్కొన్నారు. నాడు టిడిపి హయాంలో కరువుకు కేరాఫ్ గా రాయలసీమను మార్చగా, నేడు వైయస్ జగన్ సర్కారు సీమను సస్యశ్యామలంగా చేసిందన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలనతో సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు.

కార్యక్రమంలో రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్.గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, వైయస్ఆర్ సిపి మహిళా విభాగం జోనల్ ఇంచార్జ్ గాజుల శ్వేతరెడ్డి, కార్పొరేటర్లు లక్ష్మిరెడ్డి, లక్ష్మికాంత రెడ్డి, నారాయణ రెడ్డి, జయరాముడు, సాన శ్రీనువాసులు, శ్రీనివాసరావు, డిఈఈ రవిప్రకాష్, ట్యాప్ ఇంస్పెక్టర్ రఫిక్, వైయస్ఆర్ సిపి నాయకులు కనికే శివరాం, బాబుల్ రెడ్డి, బాబురెడ్డి, సి.హెచ్. మద్దయ్య, అనిల్ కుమార్, తిరుపాలు, శ్రీను, చిన్న, శ్రీనివాస రెడ్డి, బంగారు రాజశేఖర్, చంద్రిక, సుభాషిణి, సంజీవ రెడ్డి, సామన్న, రాజేష్, రమణ, బాలచంద్ర రెడ్డి, సంతోష్, లక్ష్మీపతి, పందిపాడు శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News