రాష్ట్రవ్యాప్తంగా జగనన్న సురక్ష విజయవంతం అయిందని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న సురక్ష’ విజయవంతం అవడంతో దాదాపు అన్ని పథకాలు ప్రజలకు చేరుతున్నాయని ప్రజలు మాకు అభినందనలు తెలుపుతున్నారని ఆయన అన్నారు. వాలంటీర్లు సచివాలయ సిబ్బంది కలిసి ప్రజలకు 11 సమస్యలను తీర్చామని ఆయన అన్నారు. వాటిలో ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, రైస్ కార్డ్, ఓటర్ కార్డ్, భూ సమస్యలను ఈ జగనన్న సురక్ష పథకంలో ప్రజలకు ఈ సమస్యలు లేకుండా తీర్చామని ఆయన తెలియజేశారు. లక్ష 200 మంది కుటుంబాల దగ్గరకు వెళ్లి వాళ్ళ సమస్యలను 82 వేల 47 మంది సమస్యలను పరిష్కరించామని వారు ఆఫీసులో చుట్టూ తిరగకుండా వారి సమస్యలను పరిష్కరించే విధంగా చేశామని ఆయన తెలియజేశారు.
టిడిపి నాయకులు ముఖ్యమంత్రి ఈ దేశాన్ని మరో శ్రీలంక చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ప్రజలకు అనేక పథకాలు అందిస్తున్నారని అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కింద చాలా మందికి డబ్బులు లేకుండా మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఆయన అన్నారు. త్రాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు 115 కోట్లు తెచ్చి సమస్యలు లేకుండా చేస్తున్నామని ఆయన ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చార్మింగ్ కమిటీ మెంబర్ సుదర్శన్ రెడ్డి, కార్పొరేటర్లు కాంత రెడ్డి, నాగ లక్ష్మిరెడ్డి, లక్ష్మిరెడ్డి, హనుమంతు రెడ్డి,శ్వేతా రెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.