కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని, దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పెట్టి దళితులకు ఏమో చేస్తామనడం ప్రజలను మోసం చేయటమే తప్ప మరొకటి కాదన్నారు కవిత. ఖర్గే వచ్చి ఎస్సీ డిక్లరేషన్ చేయడం అర్రస్ పాట పాడినట్టు ఉందన్నారు. రాజకీయం కోసం తప్ప దళితుల కోసం చేసేదేమీ లేదని ఆమె మండిపడ్డారు.
ఇన్ని రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏమి చేసిందని నిలదీసిన కవిత… ఇప్పుడు ఎన్నికలు ఏమి చేస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. రైతుల కోసం బిజెపి మీటింగ్ పెట్టడం ఆ సభకు అమిత్ షా రావడం హంతకుడే రైతులకు సంతాపం తెలిపినట్టుందన్నారు. దళితుల కోసం పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్న కవిత..కర్ణాటక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని కుంటి సాకుగా చెప్తూ ఉచిత పథకాలను ఎత్తి వేసిందన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన రైతు బందును కాపీ కొట్టి మోడీ ప్రభుత్వం 13 కోట్ల మందికి రైతు బంధు ప్రారంభించి 2.5 కోట్ల మందికే ఇస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో మాత్రం అందరికీ ఇస్తున్నారని కవిత సగర్వంగా వివరించారు.