మహారాష్ట్ర అభివృద్ధిలో తమ పార్టీ కీలక భాగస్వామి అవుతుందని, ఇక్కడి ప్రజల కోసం తాము పని చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ముంబయిలో, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఆమె నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహారాష్ట్ర సాంస్కృతిక సంగీతం, డోలు చప్పుడు తో కార్యక్రమ వేదిక మార్మోగింది.
ముంబై పట్టణంలో రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే మంచినీరు సరఫరా అవుతుందని, హైదరాబాదులో మాత్రం 24 గంటల పాటు నల్ల ద్వారా ఇంటింటికి మంచినీరు అందుతుందని ఆమె వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం చేసినప్పుడు మహారాష్ట్రలో ఎందుకు చేయలేరని ప్రశ్నించారు.