Thursday, July 4, 2024
Homeపాలిటిక్స్Kavitha: సంజయ్ ను భారీ మెజారిటీ తో గెలిపించండి

Kavitha: సంజయ్ ను భారీ మెజారిటీ తో గెలిపించండి

సంజయ్ నాకు అన్నతో సమానం.. మల్లాపూర్ రోడ్ షోలో కవిత

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మల్లాపూర్ మండలం లో రోడ్ షోలో పాల్గొన్నారు.. ముత్యంపేట నుండి మల్లాపూర్ కు భారీ బైక్ ర్యాలీ తో చేరుకున్నారు.. భరత మాత కూడలి వద్ద కవిత సభ ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా బీ ఆర్ యస్ ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ..మూడు గంటల కరెంటు కావాలా..
24 గంటల కరెంట్ కావాలో రైతులు తెల్సుకోవాలి..రైతుల పక్షాన నిలబడేది కెసిఆర్ మాత్రమే.

- Advertisement -

ఒకరేమో మూడు గంటలు అంటారు…ఇంకొకరేమో మోటార్లకు మీటర్లు అంటారు…
ప్రజలు ఆలోచించాలి… కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మోసం చేయడానికి వచ్చారు… లోకల్ నేను…
ఒకరేమో నిజామాబాద్, ఇంకొకరేమో ధర్మపురి..వీళ్ళు ఆంధ్రావాళ్లలాగే.. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులకు నియోజకవర్గం సమస్యల పై ఎం తెలుసనీ ఓట్లు అడగడానికి వస్తుర్రు… జనాలని పట్టించుకోని నాయకులు మనకు అవసరమా…ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావాలని తెలిపారు సంజయ్.

ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్సి కవిత ప్రసంగిస్తూ..

సోమన్న దయవల్ల అందరూ బాగుండాలి…సంజయ్ నాకు అన్నతో సమానం…మీ ప్రాంత బిడ్డను ఎమ్మెల్యేగా గెలిపించండి..విజ్ఞత తో ఓటేసి మీ నాయకున్ని మీరే ఎంచుకొనే అవకాశం మీకు ఉంది…200 ఉన్న పెన్షన్ ను ఇప్పుడు 2000 చేసాం, అప్పుడు కరెంటు ఉంటే వార్త…
ఇప్పుడు కరెంటు పోతుందా…తెలంగాణ కోసం కొట్లాడినం.. పిడికిలెత్తి పోరాడినం..మన పోరాట ఫలితమే తెలంగాణ…కెసిఆర్ వచ్చాక అందరికి మేలు జరిగింది… బి ఆర్ యస్ గెలిస్తే మీరందరు గెలిచినట్టే…దేశంలో నెంబర్ వన్ స్థానం లో ఉన్నాం.. ఎలక్షన్ లు వచ్చినప్పుడే నాయకులు మీ దగ్గరికి వస్తారు…కాని ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉన్నది మేమే..నర్సింగా రావు కాదు. ఎలక్షన్ రావు ఎన్నికలు వచ్చినప్పుడే మీ వద్దకు వస్తడు, అధికారంలో లేనప్పడే కాంగ్రెస్ నేతలు అహంకారం తో మాట్లాడుతున్నారు…వాళ్ళకి అధికారం ఇస్తే ప్రజలతో ఆడుకుంటారు…బీ ఆర్ యస్ అధికారం లోకి వస్తే 400కే గ్యాస్ సిలిండర్ అధికారం లోకి రాగానే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తాం, తెల్లారేషన్ కార్డు ఉన్న వారికి కుటుంబ బీమా ఇవ్వబోతున్నాం..సంజయ్ ని భారీ మెజారిటీ తో గెలిపించి కెసిఆర్ కు బహుమతి గా ఇద్దాం అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్మన్ దావ వసంత, జడ్పీటీసీ సంది రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కాటిపల్లి సరోజన, బీ ఆర్ యస్ పార్టీ మండల అధ్యక్షులు తోట శ్రీనివాస్, రైతు బందు సమితి అధ్యక్షులు కొమ్ముల జీవన్, బీ ఆర్ యస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News