Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్KCR @ Chinthamadaka: మహానేతకు జన నీరాజనం

KCR @ Chinthamadaka: మహానేతకు జన నీరాజనం

కేసీఆర్ కు నీరాజనం పడుతున్న చింతమడక ప్రజలు

తెలంగాణను సాధించిన జాతిపిత, దేశానికి ఆదర్శంగా నిలిపిన మహానేత ను చూసేందుకు అభిమానులు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున తరలుతున్నారు. తమ అభిమాన నేతను చూసేందుకు గత మూడు రోజులుగా ఎర్రవెల్లి నివాసానికి పార్టీ నేతలు ప్రజలు ఇతర ప్రముఖులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.

- Advertisement -

బుధవారం చింతమడక గ్రామం నుండి వేలాదిగా ప్రజలు
తమ సొంత గ్రామ బిడ్డను చూసేందుకు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు.

అధినేత కేసీఆర్ ను చూడగానే జయ జయ ద్వానాలు చేసారు.
వారిలో గూడుకట్టుకున్న అభిమానం ఒక్కసారిగా పెల్లుబికింది. కేసీఆర్ ను చూసిన వారి అభిమానం కట్టలు తెంచుకుంది. పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ముందుకురికారు.

సీఎం కేసీఆర్… జై తెలంగాణ..జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. వారికి అధినేత కేసీఆర్ అభివాదాలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News