Friday, September 20, 2024
Homeపాలిటిక్స్KCR @Janagama: కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో వేద్దాం: సీఎం కేసీఆర్

KCR @Janagama: కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో వేద్దాం: సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ప్రసంగం..వారి మాటల్లోనే

- Advertisement -

‘‘ పల్లా రాజేశ్వర్ రెడ్డి హుషారు ఉన్నాడని తెలుసుకానీ. ఇంత హుషారుంటారనుకోలేదు.
మీరు ఏమీ లేదు సభ పెట్టిపోతే చాలు గెలిచి వచ్చిన తర్వాత అన్నీ అడుక్కుంట అని తెలిపిండు.
దొడ్లకొచ్చినక గోద పెండ పెట్టకపోతదా అన్నట్లు పేద్ద లిస్టు చదివి చేస్తవా చస్తవా అన్నట్లు చేసిండు ఈయన కన్నా ముత్తిరెడ్డే నయముండే ఇటువంటి నాయకులుంటేనే మంచిది. ఎమ్మెల్యేకాకముందే సమస్యలు తెలుసుకుని, మీ అందరితోని మాట్లాడి చాలా విషయాలు చెప్పినారు అవన్నీ కూడా చేయదగిన అంశాలే. చాలా గొప్ప విషయాలేమీ కావు.

వాటన్నింటికి కూడా నేను చేసి పెడ్తాను. మెడికల్ కాలేజీ వచ్చిందంటే నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ కాలేజీలు అన్ని వచ్చేస్తాయ్. అది రాష్ట్ర స్థాయి పాలసీ డిసీషన్ ఉండే. దానికి ఇబ్బందే లేదు అవన్నీ కూడా వస్తయ్ చేర్యాల మావొళ్ల కెందుకో రెవెన్యూ డెవిజన్ కావాలని ఉన్నది. అది ఏమంతా పెద్ద విషయం కాదు. రాజేశ్వర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుని తీసుకుని రండి. మీకు నెలరోజుల్లో రెవెన్యూ డివిజన్ చేసి పెడతా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నా.

జనగామ ఒకప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు. యాది చేసుకుంటేనే భయమయ్యే పరిస్థితులు కండ్లకు నీళ్లచ్చే పరిస్థితులు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ నలు చెరుగులా అన్ని జిల్లాలు, అన్ని మండలాలు మూల మూల తిరిగిన మీకు తెలుసు. ఎనిమిది పది చోట్ల కన్నీళ్లు తీసుకుని నేను ఏడ్చిన. చాలా భయంకరమైన ఆవేశం వచ్చేసి స్టేజీ మీదనే ఎడ్చినా. అట్ల నేను ఏడ్చినటువంటి ప్రదేశాల్లో బచ్చన్నపేట మండల కేంద్రం ఒక్కటి.
సిద్ధిపేట నుంచి సూర్యాపేటకు పోతూ వయా బచ్చన్నపేట, జనగామ వెళతాఉంటే బచ్చన్నపేటలో కొద్దిమంది కలిసి ఇది మండల కేంద్రం సార్ మీకు తెలుసున్న ఏరియా ఐదు నిమిషాలు మాట్లాడి పొమ్మని చెప్పినారు. నాలుగైదువందల మంది మాత్రమే ఉన్నారు. జనం కూడా లేరు. అక్కడ ఆగినాం. నా ఎంబడి జీపులో మైకు ఉంటే అందులో ఎక్కి మాట్లాడుతున్నం. ఎదురుంగ చూస్తే ఒక్క యువకుడు కూడా లేడు. అందరు ముసలివాళ్లే ఉన్నరు. ఒక్క యువకుడు లేడు ఏంది కథ అంటే.. ఒక్క యువకుడు కూడా లేడు సార్, ఇప్పటికే 8 ఏండ్లు కరువుపడి బచ్చన్నపేట చెరువు అడుగంటుకుని మొత్తం మునిగి పోయింది. ఎండిపోయింది . బావులల్లా కూడా నీళ్లు లేవు. బోర్లు కూడా సరిగ్గా పోస్తలేవు. 8 కిలోమీటర్లు పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాం. బండి మీద బ్యారెళ్లు పెట్టుకుని అంటూ వాళ్లు ఏడ్చినరు నాకు కూడా దుఖ: ఆగలేదు. దగ్గరలోనే గోదావరి ఉంటది మనకు హక్కు ఉంటది. రోజుకు ఒక్క రోజు స్నానం చేయనటువంటి పరిస్థితుల్లో ఉండటం బాధ అనిపించింది.

యువకులు మొత్తానికి మొత్తం అన్నమో రామచంద్ర అంటూ పొట్ట చేత పట్టుకుని వలుసలు పోయినటువంటి దుస్థితి కళ్లారా చూసి నేను ఏడ్చినా ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు చాలా మంది చాలా మాటలు చెస్తారు.
నేను ఒక్కటే చెప్పినా. హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే మార్గంలో ఒకటి లేదా రెండు ఎకనామిక్ గ్రోత్ సెంటర్లు కావాలే. ఎక్కడ అన్న పాయింట్ పెట్టండని అధికారులను కోరితే వారు వేరే వేరే పెట్టినారు.

నేనే నా పెన్ను పెట్టి ఇది కాదా పాయింట్ అని చెప్పి జనగామ మీద పాయింట్ పెట్టినా, రెండవది భువనగిరి మీది పాయింట్ పెట్టినా. ఈ రెండు కూడా గ్రోత్ కారిడార్ అయినవి. నీళ్లు వచ్చిన తర్వాత పాత వరంగల్ జిల్లాలో చూసుకున్నట్లయితే అత్యధికంగా వడ్లుపండించిన తాలుకానే జనగామ అప్పుడప్పుడు నేను తెలుసుకుంటావున్నా.. బచ్చన్నపేట చెరువు సంగతి ఏమైందని. సార్ ఆనాడు ఎండిపోయింది కానీ 365 రోజులు నిండే ఉంటుందని అధికారులు చెప్పినారు. ముత్తిరెడ్డి గారు కూడా చెప్పినారు.
చాలా సంతోషం జనగామలో ఏదైతే జరుగాలనుకున్నామో. మంచినీళ్లు అమ్ముకునేటటువంటి దుకాణాలు సైతం కూడా ఉండెనో .. అవన్నీ మాయమైపోయి చక్కగా మంచి పద్ధతిలో జనగామ అభివృద్ధి చెందుతా ఉంది.వందశాతం అభివృద్ధి చెంది తీరుతది.

హైదరాబాద్ కు సమీప ప్రాంతం కాబట్టి సిటీ దాటితే 60 కిలోమీటర్లు ఉంటది జనగామ. ఉప్పల్ దాటి ఘట్ కేసర్ దాటిన తర్వాత చాలా దగ్గరగా ఉంటది. భవిష్యత్తులో కూడా ఇండస్ట్రీయల్ తోటీ, ఐటీ కారిడార్ తోని చాలా అద్భుతంగా డెవలప్ అయ్యే అవకాశముంటది.
ఎన్నికలు చాలా సందర్భంలో వస్తయి. చాలా పోతయి. ఎవరో ఒకరు గెలుస్తా ఉంటరు. ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు. పరేషాన్ కావద్దు.
ఎవరో చెప్పిండ్రని అలవోకగా ఓటువేయవద్దు. మన బావమరిది చెప్పిండో చుట్టం చెప్పిండో, మన మేనమామ చెప్పిండో అనే పద్ధతిలో ఓట్లు వేయకూడదు.
ఓటు అనేది మన తలరాతను మార్చుతది, తాలుకా రాతను మార్చుతది, మన రాష్ట్ర దిశను, దశను మార్చుతది.
చాలా ముఖ్యమైన ఆయుధం. ప్రజా స్వామ్యంలో మన చేతిలో ఉండే బలమైన ఆయుధమే ఓటు. దానిని ఎటు వినియోగిస్తమో మన ఖర్మ అటు వెళ్లిపోతది. ఎవడో వచ్చి ఏదో చెబితే నమ్మితే చాలా ప్రమాదమచ్చే ఆస్కారముంది.

కొందరు ఆపద ముక్కులు మొక్కే వారు ఉంటరు. ఐదేండ్ల రాక కనబడరు. ఎలక్షన్లు మోపు కాంగనే వస్తరు. ఇష్టమచ్చిన మాటలు మాట్లాడతరు. అట్ల కాకుండా మంచి ఏందో చెడ్డ ఏందో గుర్తించి మంచి వైపు నడిస్తే చాలా బ్రహ్మండమైన ఫలితాలు వచ్చే అస్కారముంటుంది.

సంతోషమైన వార్త మీకు చెప్పేదేమంటే ముత్తిరెడ్డి గారికి కూడా చెప్పినా దేవాదుల ప్రాజెక్టు ద్వారా కాకుండా కాళేశ్వరం లింకైన మల్లన్న సాగర్ మీ ఎత్తుమీద కుండలాగానే ఉంటది. 50 టీఎంసీల ప్రాజెక్టు నుంచి కూడా టపాసుపల్లి రిజర్వాయరుకు లింకు చేస్తున్నం. దీనివల్ల ఎక్కడ కరువొచ్చినా జనగామలో కరువు రాదు. నిశ్చింతంగా ఉండాలని మనవి చేస్తున్నా.

కొన్ని కొన్ని రిపేర్లు, పంట కాలువలు కావాలని కావాలని కోరినరు. అన్ని కూడా నా దగ్గర ఉన్నయ్.
వాటన్నిటిని కూడా పరిశీలిస్తాను. ఎట్లాగు నీళ్లు తెచ్చుకున్నాం. మొదటి దశ పనులు పూర్తి అయినయి. కొంత ఆయకట్టుకు అందుతా ఉంది. రెండు మూడుల లిఫ్టులు పెట్టుకుంటే జనగామలో వందశాతం నీళ్లు వస్తాయి. అవి తెచ్చి నేను మీకు అప్పగిస్తా .

దేవాదుల తెలంగాణ గులాబీ జెండా ఎగురవేయగానే చంద్రబాబు వెళ్లి నది ఒడ్డుకు శంకుస్థాపన చేసినారు. మాయమాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. కొంత మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా పూర్తిచేయలే. దానిని ప్రపోజ్ చేయలే. నదిలో నీళ్లు పోతయి కాని అందించలేదు.
సమ్మక్క బ్యారేజీ అని కట్టుకున్నాం. ఏడున్నర టీఎంసీల నీళ్లు బ్యారేజీలో నిలబడి ఉంటాయి. దీనిని వరంగల్ జిల్లాకే అంకితం చేసినం. ఎవరకు కరువొచ్చినా.. గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతికలిసిన తర్వాత కింద ఉన్న సమ్మక్క బ్యారేజీ నుంచే దేవాదుల కు నీళ్లు వస్తాయి . మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మే నెలలో కూడా నీటిని వాడవచ్చు.
బంగారం తునక లాంటి, వజ్రం తునక లాంటి వరంగల్ జిల్లాను చూడబోతున్నాం.దానికి తార్కాణమే మీరు పండించే పంటలని చెబుతా ఉన్నాం.
మ్యానిఫెస్టో ప్రకటించినం
ఒక విషయం మీరు ఆలోచన చేయాలే. రాష్ట్రం వచ్చిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాల కింద మన తెలంగాణ పరిస్థితి ఏంటి? ఏ విధంగా ఉండే? ఎక్కడ చూసినా వలసలు, కరువు, సాగునీళ్లు లేవు, మంచినీళ్లు లేవు, కరెంటు లేదు, ఆర్థిక పరిస్థితి ఎట్ల ఉంటదో తెలువదు.
అంచనాలు ఎవరికి లేవు. చాలా మంది ఆర్థిక నిపుణులను పిలిపించి మన జీఆర్ రెడ్డి గారు బీహరులో ఉంటే పిలిపించాం. రెండు మూడు నెలలపాట మేధోమధనం చేసినం మెదడు కరుగతీసినం. ఒక దారి పట్టుకున్నం.భగవంతుని దయవల్ల విజయవంతమైనం.

ఆనాడు గొడగొడ ఏడ్చినా ఎవడూ పట్టించుకోలేదు. ఆనాడు రాజ్యం చేసినోళ్ల కాలంలో ఏ పరిస్థితుల్లో ఉండే. ట్రాన్స్ ఫార్మర్లు కాలుడు. పంట పండే లోపల ఒకసార్ల, రెండుసార్ల మోటార్లు కాలుడు. రూపాలు దానికే పోవుడు. ట్రాన్స్ ఫార్మర్ లు కాలిందంటే బాయికి రెండు వేలు తియ్యిండ్లు అనేవాళ్లు. ట్రాక్టరు మీద పెట్టుకుని పోతే నాలుగు రోజులకో ఐదు రోజులకో వస్తే వచ్చే వరకే కొస దొయ్యలు ఎండిపోయే పరిస్థితి. కానీ ఈ రోజు ఎక్కడ ట్రాన్స్ ఫార్మర్ కాలుతలేదు. ఎక్కడ మోటర్లు కాలుతలేవు.

ఈ నాడు కంప్లీట్ తారుమారుచేసినం .24 గంటలు నాణ్యమైన కరెంటు ఉంటాఉంది. రైతు దగ్గరికి వచ్చి ఎన్ని మోటార్లు పెట్టినవి అనే వాడు కోనాయే అనే కొడుకు లేడు.

తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరుగాలే. గ్రామాలు చల్లగా ఉండాలే.పంట పండితే తింటే దంగుతారురా అన్నరు పెద్దలు. పంటలు ఎట్ల పండుతున్నయో మీరు కండ్లారా చూస్తా ఉన్నారు.

పెట్టుబడులు సాధించడంలో20 నుంచి 25 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించడంలో పారిశ్రామిక విధానం కావోచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు. వాటన్నిట్లో నెంబర్ వన్ గా ఉన్నాం.

హెలీకాప్లర్ లో ఎటైనా పోతే ఏ గ్రామంలో చూసినా , డాంబర్ రోడ్డు మీద బ్రహ్మండమైన వడ్లు లక్షల టన్నుల ధాన్యం కనబడుతా ఉంది. అది చూస్తే నా మనసు పులికిస్తాఉంది.

తెలంగాణలో ఇవ్వాల అమ్మవారి దయ. లక్ష్మీదేవత తాండవం అడినట్లు పల్లెలన్నీ కూడా కళకళలాడుతా ఉన్నాయి.
జర ముఖం తెలివికి వచ్చినం. తెలంగాణ రైతులు ఇప్పుడే రెండుసార్లు అప్పు మాఫీ చేసుకుని వడ్లన్నీ ప్రభుత్వమే కొని ఒక మాదిరిగా ఉన్నాం
మళ్లీ ఇప్పుడు కొత్త వాళ్లు వస్తున్నారు.
నేను ఏమి చెప్పినా ధైర్యంగా చెబుతాను. చాటుకు మాటుకు చెప్పను. రైతుల భూముల మీద హక్కులు రైతులకే ఉండాలని వాదించే వాడిని నేను. నేను మీకు ఒక అధికారం ఇచ్చినను. అంతకు ముందు ఎంతమంది ఉండేది మనకు . వీఆర్వో ఒకటి రాస్తడు, గిర్ధావరి ఉంకొకటి రాస్తడు, నాయబ్ తహసీల్ధార్ ఇంకొకటి రాస్తడు. ఎమ్మార్వో ఇంకొకటి రాస్తడు. జాయింట్ కలెక్టర్ కోర్టుకు పోతే ఆయన దయ,దాని మీ ద కలెక్టర్, దానిమీద సీసీఎల్ ఏ, దానిమీద రెవెన్యూ సెక్రటరీ, ఈన్నుంచి ఆందాక ఏ ఒక్కరికి కోపమోచ్చినా కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లు రైతు మునిగిపోతడు.
నేను కూడా కాపోడిని కాబట్టి, వ్యవసాయంలో పుట్టినోడిని కాబట్టి రైతుల బాధ తెలిసనోడిని కాబట్టి, ఒక పనిచేసి పెట్టిన. గవర్నమెంటు దగ్గర తహసీల్దార్ లకు, ఆర్డీవోలకు, రెవెన్యూ మంత్రికి, రెవెన్యూ సెక్రటరీకీ ఉండే అధికారాన్ని తీసి రైతు చేతిలో పెట్టినా.
నీ భూమి మార్చాలంటే ఎవ్వరూ మార్చలేడు. ధరణి తెచ్చిన విప్లవమది. ధరణి పోర్టల్ లో సునాయసంగా జరుగుతున్నది. నీ భూమిని ముట్టే హక్కు ఎవ్వనికి లేదు. నీ భూమిని మార్చాలంటే నువ్వే కర్తవు. నీ బొటన వేలి ముద్రతోనే మారుతది తప్ప వేరే మారే ప్రశ్నలేదు. ముఖ్యమంత్రికి కూడా అధికారం లేకుండా చేసినం. భూమి మీద అధికారాన్ని మీకే ఇచ్చినం కాంగ్రెసోళ్లు మాట్లాడుతున్నరు. కౌలు రైతులని మాట్లాడుతున్నరు. ఎక్కడికెళ్లి తెస్తారు లెక్క. ఎవ్వరు రాస్తడు లెక్క. కౌలంటే కిరాయికి ఇచ్చుడు. ఇల్లు కిరాయికి ఇచ్చినట్లే.పొలం కిరాయికి ఇచ్చుడు. పంట చేయడం చేతకాక. ఇతరులకు పంట చేసుకొమ్మని కిరాయికి ఇవ్వడం.
బంజరాహిల్స్ బంగ్లాలు కూడా కౌలుకిత్తరు కదా. అక్కడెందుకు రాయరు కబ్జాదారు కాలమని చెప్పి. బంజారాహిల్స్ బంగ్లాలకేమో మాఫీ , రైతులేమో అగ్గో దొరికిండ్లు బిడ్డా. రైతులను గోల్ మాల్ చేసి తాకులాటలు పెట్టిచ్చి కోర్టుల చుట్టూ తిప్పి నాశనం చేస్తున్నరు కాబట్టి నా ప్రాణం పోయినా సరే బీఆర్ ఎస్ గవర్నమెంట్ ఉండగా దాన్ని మారనియ్యా అని చెప్పిన.

మీ భూముల మీద హక్కులు మీకే ఉండాలే. కౌలు రైతులనే దుకాణం కాంగ్రెస్ మొదలు పెట్టింది. వాళ్లు ప్రకటించిన మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్లు. సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ధరణి ని తీసి బంగాళాఖాతంలో వేస్తాడట. అలా చేస్తే మళ్లీ తహసీల్దార్లు, గిర్ధావర్లు, వీఆర్వోలు వచ్చి భూముల తాకులాటలు పెట్టిస్తారు. కోట్ల చుట్టు తింపుతే సచ్చిపోతం నాశనమై పోతం. కాంగ్రెస్ రాజ్యం మళ్లా రావాలన్నా? ఇబ్బందులకు గురికావాల్నా? ముఖ్యమంత్రి గా ఉన్నంత మాత్రానా ఊరుకోవడం లేదు. నేను వ్యవసాయం చేస్తున్నా.
ఎవరిని బంగళాఖాతంలో వేయాలే ? ధరణిని తీసేస్తానన్నకాంగ్రెస్ నా? ధరణిని బంగాళాఖాతంలో వేయాల్నా ? ఆలోచించాలని చెబుతున్నా?
నేను మూడేండ్లు నాలుగేళ్లు తలపగలగొట్టుకుని నేను కూడా కాపోన్ని కాబట్టి వారి ప్రయోజనాలను కాపాడాలని ఒక విప్లవం లాగా తీసుకొని వచ్చినాం. దాన్ని మీ కండ్ల ముందు ఉంచినాం.
అందుకే మిమ్మల్ని హెచ్చరించేంది. అందుకే ఓటు అలఓకగా వేయవద్దు.అలకగా వేయద్దు. ఆలోచించి వేయాలే. ఎందుకంటే మన నెత్తి మనమే కోసుకుంటమా. బంగారు కత్తి అని మనమే కోసుకుంటమా.

ఇవాళ వాళ్లకు వోటేస్తే వీఆర్వోలు వస్తరు. కరెంటు గురించి కాంగ్రెస్ వాళ్లు వాళ్ల మనసులో ఉన్న మాట. మూడు గంటలిస్తే సరిపోతదన్నారు. భారతదేశంలో 24 గంటలు రైతులకు కరెంటుఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
ఎందుకు చేతనవుతలేదు కాంగ్రెసోళ్లకు వారి గవర్నమెంటు ఉన్న కాడా ఇస్తున్నరా. ఇవాళ కర్ణాటక లో నిన్నగాక మొన్న గెలిచిండ్లు అక్కడ పంటలు ఎండిపోతా ఉన్నయ్. రైతులు రోడ్ల మీద ధర్నాచేస్తా ఉన్నారు.
కరెంటు 24 గంటలు ఉండాలంటే, రైతుల భూములు సేఫ్ గా ఉండాలంటే, ఇదే పద్ధతిలో రిజిస్ట్రేషన్ కావాలంటే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మీరు శిక్షించాలే. తగిన బుద్ధి చెప్పాలే. ఏ మాత్రమ ఏమరుపాటుగా ఉన్న చాలా దెబ్బ తగులుతది. అప్పుడు నేను కూడా ఏమి చేయలేని పరిస్థితి ఉంటది. మళ్లా ఉద్యమాలు చేయడం తప్ప చేయాల్సిందేమి ఉండదు.
ఇంత మంచి అధికారాన్ని ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినదాన్ని పీపుల్స్ ఎంపౌవర్ మెంట్ అంటరు. పోడగొట్టుకోవద్దని మనవి చేస్తా ఉన్నా.

93 లక్షల కుటుంబాలకు ప్రభుత్వమే రైతుబీమా ఎలాగైతే కట్టినమో , ప్రభుత్వమే నాలుగైదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వమే చెల్లించి అన్ని కుటుంబాలకు బీమా ఏర్పాటు చేస్తాం. సహజ మరమైన వారం లోపు ఐదు లక్షల రూపాయలు మీ ఖాతాలో వచ్చి జమయ్యేటట్లు నేను ఏర్పాటు చేస్తా.
ప్రభుత్వం వచ్చిన మూడు నాలుగు నెలల్లో మొత్తం బీమా సెట్ అయితది. రైతులకు పెడితే బ్రహ్మాండంగా వచ్చినది. అన్నపూర్ణ లాగా రాష్ట్రం తయారైంది. దేశానికి అన్నం అన్నం పెడ్తా ఉన్నాం. మనం ఎందుకు సన్నబియ్యం తినొద్దు.
మార్చి తర్వాత తెల్లకార్డు కార్డు దారులందరికీ సన్నబియ్యం సప్లయి చేస్తాం.
అద్భుతమైన ప్రజా మేనిఫెస్టోను ప్రకటించినం. రైతుబంధు పెంచినం . వీటన్నింటిని ముందుకు తీసుకెళ్తాం.

తెలంగాణలో రైతులు, కూలీలు బ్రహ్మాండగా తయారయ్యేవరకు మనం విశ్రమించేది లేదు. మంచి గ తయారైనాం ఈ ప్రగతి ఇదేవిధంగా కొనసాగాలే.
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నాకు చాలా దగ్గరివాడు. మంచి పనిచేసినాడు. చిన్న చిన్న ఇబ్బందులు రావడం వల్ల నేనే తనకు రిక్వెస్ట్ చేసినాను. బంగారమోలే గెలిచే సీటు పోడగొట్టుకోవద్దు. ఈ టర్మ్ ఒక యువకుడిని పెడుతామని పల్లా రాజేశ్వరిరెడ్డిని పంపిద్దామని ఆలోచన చేసినం.

రాజేశ్వర్ రెడ్డి నా ఇంట్లోనే ఉంటాడు 24 గంటలు. పార్టీ ప్రధాన కార్యదర్శి. ఒక ఎలక్షన్ కోసం కాదు. పార్టీ ఏ పాలసీ ఉన్నా ఏ ముఖ్యమైన నిర్ణయం ఉన్నా దాంట్లో భాగస్వామిగా ఉంటడు. మీకు ఇబ్బందే లేదు. నీరటే మీ దగ్గర ఉన్నడు. కేసీఆర్ తోని పక్కకు ఉండే వ్యక్తే మీ దగ్గర ఎమ్మెల్యేగా ఉంటే ఏ పనికూడా ఆగదు బ్రహ్మాండగా వస్తది.
రాజేశ్వర్ రెడ్డి ని దీవించండి బ్రహ్మండగా గెలిపించండి. కోరే పనులన్నీ చేసిపెట్టే బాధ్యత నాది .
ఎన్నికల తర్వాత మళ్లీ జనగామకు వస్తను. రోజంతా ఇక్కడ ఉండి ఏమేం కావాలో తిరిగి చూస్తా.
జనగామ ప్రగతి ప్రణాళిక రచన చేసి తుచ తప్పకుండా అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా.
10సంవత్సరాల్లో ఒక మత కల్లోలం లేదు. ఒక గడబిడలేదు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది.
లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. పారిశ్రామిక విధానం బాగుండటం వల్ల 25 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినయ్ . పరిస్థితి ఇదే విధంగా కొనసాగాలే. ముస్లీంలు, హిందువుల కలిసి ఉండాలే.
కొంతమంది పిచ్చి మొండా కొడుకులు వచ్చి ఏదో ఏదో చెబుతారు. అది కరెక్ట్ కాదు
గంగా జమున నదులు ఎట్లా కలుసుంటయో , పాలు, నీళ్లు ఎట్ల కలిసుంటయో. అన్ని కులాల వాళ్లు అలాగే కలిసి ఉండాలే.
గ్రామానికి పోతూ కులం ఉండదు. అన్న, తమ్మి, బావా అంటూ మాట్లాడుకుంటం. అదేవిధంగా కలిసి మెలిసి ఉండాలి. ప్రేమతో ఉండటంలో ఉండే మజా , లాభం దేంట్లో ఉండదు. ఎవరో ఏదో చెబితే నమ్మవద్దు.
దస్ సాల్ మే తెలంగాణ రియాసత్ కే కహాసే కహాతక్ ఆయా. అమన్ పసంద్ రియాసత్ ఆయా మైనారిటీ డెవలప్ మెంట్ కే లియే హమ్ కే పహలే దస్ సాల్ కాంగ్రెస్ సర్కార్ థా. దస్ సాల్ మే 950 కరోడ్ ఖర్చ్ కియా. లేకిన్ దస్ సాల్ మే బీఆర్ఎస్ సర్కార్ 12 హాజర్ కరోడ్ ఖర్చ్ కియా. అవర్ కిస్ ప్రకార్ కా రెసిడెన్షియల్ స్కూల్ చల్ రహేహై హమారే బచ్చా ఇంగ్లీష్ మీడియం పడాయే హాసీల్ కర్ రహేహై. హమ్ లోక్ జాన్తే హమ్ సబీలోగోంకో గుజారిస్ కర్ తాహూ కేసీఆర్ జిందా రహేగా తబ్ తక్ తెలంగాణ రియాసత్ ఏక్ సెక్యూలర్ రియాసత్ బనే రహేగా, ఏ మై వాదా కర్ రహాహు. హమారా .గంగా జమునా తహజీబ్ రహేగా . జిమ్మదారి మై లేతా హూ.
బీసీలకు ఇచ్చే లక్ష రూపాయల కోసం చింతించే అవకాశం లేదు
గృహలక్ష్మి పథకం నిరంతరం కొనసాగుతుంది.
ఆసరా పెన్షన్ పెంచినం ఐదు వేల పెంచినం. సంసార పక్షంగాపెంచినం
దళిత సోదరులకు మన విజ్నప్తి . పొంకనాలు మాట్లాడొచ్చు. ఎవరికైనా దళితబంధు పెట్టాలని ఆలోచన వచ్చిందా. ఏ ప్రధానమంత్రికో, ముఖ్యమంత్రికో దళితబంధు పెట్టుంటే దళితుల జీవితాలు ఇట్ట ఉండేవా.
కేసీఆర్ బతికి ఉన్నంత వరకు దళితబంధు పథకం కొనసాగుతంది.
ఎన్నికల మేనిఫెస్టోలో కాకుండా వేరేవి ఎక్కువ పథకాలు ఇచ్చాం. కులం లేకుండా, మతం లేకుండా
అన్ని గ్రామాలు మనవే, ప్రజలు మనవారే. అందరి బిడ్డలు మనవే, అందరిని కడుపుల పెట్టుకుని తీసుకువెళ్తాం.
జనగామతో పాటు తెలంగాణ కూడా అభివృద్ధి కావాలనే అనే నమ్మకంతో ఈ రోజు పార్టీలో మన పార్టీలో సున్నాల చేరినరు.
పొన్నాల దీవెన, ముత్తిరెడ్డి గారి ఆశీర్వాదంతో, మీ అందరి మద్ధతు చూస్తూ ఉంటే లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని తెలిసిపోతుంది.
మళ్లీ చేర్యాలకు వస్తాను. ఎన్నికలు ముగించేముందు వస్తాను. చేర్యాల మీద ప్రత్యేకమైన ప్రేమ ఎందుకంటే నాకు క్లాస్ మేట్లు ఉంటారు. రారా పోరా అనే దోస్తులు రెండు మూడు వేల మంది ఉన్నారు.
ఒక నియోజకవర్గం మీటింగ్ లా లేదు వరంగల్ జిల్లా మీటింగ్ లా ఉంది
జై తెలంగాణ, జై తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు’’ అంటూ కేసీఆర్ గారు ప్రసంగం ముగించారు.
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్ , ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదిరెడ్డి, తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్ గారి ప్రసంగం – ముఖ్యాంశాలు :

• కరువు ప్రాంతంగా ఉన్న భువనగిరిలో ఈరోజున చాలా అద్భుతమైన పంటలు పండుతున్నాయి.
• గోదావరి జలాలు, ఇక్కడున్న రెండు మూడు కాలువలు ఈ ప్రాంతానికి రావాలని మనం ఎన్నో పోరాటాలు చేసాం. ఎన్నో కలలు కన్నాం.
• కాలువల పనులు జరుగుతా ఉన్నయ్. త్వరలో పూర్తవుతాయి.
• ఈ జిల్లాకు లక్ష్మీ నర్సింహస్వామి ఆశీస్సులతోని యాదాద్రి భువనగిరి జిల్లా అని భగవంతుని పేరు పెట్టుకున్నాం.
• తెలంగాణ రాష్ట్రం రాకుంటే భువనగిరి జిల్లానే కాకపోతుండె.
• మళ్లీ శేఖర్ రెడ్డిని గెలిపిస్తారు కాబట్టి.. 98 శాతం పూర్తయిన బసవాపూర్ రిజర్వాయర్.. నృసింహ సాగర్ ను ప్రారంభించుకుని లక్ష ఎకరాలకు సాగునీరును అందిస్తాం.
• గత కాంగ్రెస్ ప్రభుత్వం భువనగిరిలో అరాచక శక్తులను పెంచిపోషించింది. ప్రజలకు గోస పుచ్చుకున్న అలాంటి అరాచక, కిరాతక మూకలను అరికట్టి, భువనగిరి ప్రజలు ప్రశాంతంగా ఉండేలా చేశాం.
• ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు. వాస్తవ పరిస్థితులను గ్రహించి, ఆలోచించి ఓటెయ్యాలి.
• మన ప్రగతికి, మన భవిష్యత్తుకు ఏది ముఖ్యమో, ఏది మంచిదో, ఏది చెడ్డదో ఆలోచించి ఓటు వెయ్యాలి.
• ఒక ఉద్వేగంతో కొట్టుకెళ్లి ఓటు వేస్తే మన జీవితాలు తలకిందులయ్యే అవకాశం ఉంటది.
• రైతుల భూముల మీద రైతులకే హక్కులుండాలని ధరణి పోర్టల్ ను తెచ్చాం.
• తరతరాల నుంచి వచ్చిన భూములను ఎన్నో కష్టాలుపడి కాపాడుకుంటరు.
• కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ప్రతి ఒక్కరికీ అధికారం భూములపై అధికారం ఉండేది.
• భూముల రిజిస్ట్రేషన్లకు కూడా ఎన్నో పాట్లు పడేది.
• ఇవ్వాల రిజిస్ట్రేషన్లు ఏ మండలానికి ఆ మండలంలో జరిగిపోతా వున్నది.
• ఒకరి భూములు ఇంకొకరికి వెళ్లే అవకాశం లేదు.
• రిజిస్ట్రేషన్లు మండలాల్లోనే జరుగుతున్నాయి.
• ఇవ్వాల కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామంటున్నది.
• ఒకసారి ధరణి అంటూ పోతే మన భూములపై అధికారం పోతది..అధికారులు వస్తరు..ఒకరి భూమి ఒకరి పేరు మీద వస్తది. మళ్లీ తహసీల్ ఆఫీసులు, కోర్టులు చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటది.
• నీ భూమిని మార్చే హక్కు నీ బొటన వేలుతో మాత్రమే మార్చే అధికారాన్ని ప్రభుత్వం నీకు కల్పించింది.
• మీ భూమి మారాలంటే మీ బొటనవేలు ముద్ర పడితే తప్ప ఏ ముఖ్యమంత్రికి కూడా మార్చే అధికారం లేదు ఈ రాష్ట్రంలో.
• గవర్నమెంటు తన అధికారాన్ని తీసి మీకప్పగించింది. దాన్ని ఉంచుకోవాల్నా లేదా పోడగొట్టుకోవాల్నా ఆలోచించుకోవాలని మనవి చేస్తున్నాను.
• కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులని మళ్లీ రాగాలు తీస్తా ఉన్నరు.
• ధరణి పోర్టల్ పోతే రైతులపై రాబంధులు పడుతారు.
• పొరపాటున మళ్లీ కాంగ్రెస్సే వస్తే.. మళ్లీ కౌలు రైతులు, వీఆర్వోలు, మళ్లీ రికార్డుల కెక్కియ్యడం వంటి వాటితో రైతుల భూములన్నీ ఆగమైపోతయ్.
• రైతులను పైరవీకారుల పాలు చేసిన కాంగ్రెస్ రాజ్యం మల్ల రావాల్నా.. మల్ల అదే పాట పాడాల్నా.. పాత బాధ కలుగాల్నా.. దయచేసి రైతు సోదరులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతావున్నా.
• ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నా మల్ల కాంగ్రెస్ దెబ్బ పడుతది. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తావున్న.
• నేనూ రైతు బిడ్డనే..నేనూ కాపోన్నే.. నేను కూడా వ్యవసాయం చేస్త. ముఖ్యమంత్రిగ ఉన్నంత మాత్రాన ఊరుకుంటలేను.
• రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టి మూడు సంవత్సరాలు చాలా కష్టపడి అందర్నీ ఒప్పించి ధరణి పోర్టల్ తెచ్చాం.
• ఇవ్వాల పదిహేను, ఇరవై నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాం.
• మునుపటి పరిస్థితే వస్తే చాలా ప్రమాదం వస్తది.
• ఇవ్వాల అనేక రంగాల్లో తెలంగాణ బాగుపడ్డది.
• ఒకప్పుడు కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు.. అనేక కష్టాలు ఉండె.
• ఇవ్వాల 24 గంటల కరెంటు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ.
• కాంగ్రెస్ నాయకులు 24 గంటల కరెంటు ఎందుకు? మూడు గంటలు చాలు అంటున్నారు. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది.
• ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తే.. ఖచ్ఛితంగా మల్ల ధరణి పోతది.. మల్ల పైరవీకారుల మందలు వస్తయి. వకీళ్లు, కోర్టుల చుట్టూ తిరగాలె. కేసుల పాలు కావాలె.. కరెంటు మాయమైతది. దళిత బంధు ఆగమైతది. అన్నీ కూడా పోయి మల్ల దళారుల రాజ్యమే వస్తది. అప్రమత్తంగా ఉండాలని మిమ్మల్ని ప్రార్ధిస్తావున్న.
• భువనగిరి నియోజకవర్గం అద్భుతమైన నియోజకవర్గం. హైదరాబాద్ కు సమీపంలో ఉన్నది.
• భువనగిరిని ఐటీ హబ్ చేసి, ఐటీ పరిశ్రమలు రావాలని, ఖచ్ఛితంగా తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కు చెప్పిన.
• ఎన్నికల తర్వాత భువనగిరికి స్పెషల్ ఐటీ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ కూడా పెట్టించే బాధ్యత నాది.
• బ్రహ్మాండంగా మన పిల్లలకు ఉద్యోగాలు దొరికే ఆస్కారం ఉంటది.
• 50 వేల ఓట్ల మెజార్టీతో పైళ్ల శేఖర్ రెడ్డి గెలవబోతున్నాడు.
• దయచేసి బీఆర్ఎస్ ను గెలిపించండి.. శేఖర్ రెడ్డిని దీవించండి.
• మనకు కులం, మతం, జాతి లేదు. ఎన్నికల ప్రణాళికలో అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పించాం.
• మహిళలకు సాధికారికత తెచ్చాం.
• 93 లక్షల తెల్ల రేషన్ కార్డు దారులకు కేసీఆర్ బీమా వస్తది.
• అందరికీ సన్నబియ్యమే వస్తది..ఇది నా మాటగా హామీనిస్తావున్న.
• ఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డికి మద్ధతుగా ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
• యాదాద్రి నర్సింహాస్వామి దేవాలయాన్ని అద్భుతంగా చేసుకున్నం.
• భవిష్యత్తులో ఈ జిల్లా ఒక బంగారు తున్కలాగా తయారయ్యే పరిస్థితి ఉంది.
• తెలంగాణ రాకముందు అనేక మంది సన్నాసులు అవాకులు, చెవాకులు పేలినారు.
• తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతయని చెప్పినారు. ఇవ్వాల భూముల ధరలు ఎట్లా ఉన్నయో మీ అందరికీ తెలుసు.
• యాదగిరి గుట్ట దగ్గర పొద్దున ఒకరేటు, మధ్యాహ్నాం ఒకరేటు, సాయంత్రం ఒకరేటులో ఇవ్వాల కోట్ల రూపాయలే ఉంది తప్ప లక్షల రూపాయలు లేదు.
• భూమిలేని నిరుపేదలకు కూడా న్యాయం జరగాలని బీమా, సన్నబియ్యం, సౌభాగ్యలక్ష్మి, గృహ నిర్మాణాలను ప్రకటించాను.
• మీ ఆశీస్సులతో మళ్లీ గెలిపిస్తే మీసేవలో భువనగిరిని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తాం.
• పైళ్ల శేఖర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతావున్నాను.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News