Saturday, November 15, 2025
Homeపాలిటిక్స్KCR on Anjayya Yadav: అజాతశత్రువు రావయ్యా అంటూ అంజయ్య యాదవ్ ను పిలిచిన...

KCR on Anjayya Yadav: అజాతశత్రువు రావయ్యా అంటూ అంజయ్య యాదవ్ ను పిలిచిన సీఎం

ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్

అజాత శత్రువు రావయ్యా అంటూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ను నోరారా ఆప్యాయంగా పలకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జయపాల్ యాదవ్ కలిశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో షాద్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరొక్కమారు అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని కలిసి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -


అంజయ్య యాదవ్ తో పాటు కల్వకుర్తి ఎమ్మెల్యే జి. జైపాల్ యాదవ్ కూడా ఆయన వెంట ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అంతా శుభం జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి శుభాభినందనలు తెలిపారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad