Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Khammam: బిజెపి గ్రాఫ్ పెరిగింది

Khammam: బిజెపి గ్రాఫ్ పెరిగింది

ఖమ్మం లోనే ఉంటూ..కార్యకర్తల తోడుంటా

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో బిజెపి గ్రాఫ్ గణనీయంగా పెరిగిందని పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. బీజేపీ ఈ ఎన్నికల్లో గెలవబోతోందని చెప్పారు. ఖమ్మం లోనే స్థిర నివాసం ఏర్పరుచుకుని కార్యకర్తలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల్లో తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఖమ్మం నగరంలో జరిగిన బిజెపి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మీడియా సహాయం మర్చిపోలేనిదని, మనస్ఫూర్తిగా జిల్లా అభివృద్ధి కావాలని వారు కోరుకున్నారని అన్నారు.

- Advertisement -

మన టైం స్టార్ట్ అయింది..

ఏ ఒత్తిడి లేకుండా పని చేశారని చెప్పారు. రాజకీయాలు, మతాలకు అతీతంగా ఖమ్మం సమగ్ర అభివృద్ధి కోసం యుద్ధం చేశామని, ఇందులో మనం గెలుస్తున్నామన్నారు. బిజెపి, టిడిపి జనసేన, ఎంఆర్పిఎస్ కలిసికట్టుగా ఎన్నికల్లో పని చేశాయన్నారు. పార్లమెంటు ఎన్నికల వరకు ఒక ఫేస్ అయిపోయింది, రెండో ఫేస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ, తర్వాత స్థానిక సంస్థలు. ఎన్నికలు ఉన్నాయనీ ఆ ఎన్నికల్లో తన భాగస్వామ్యం ఉంటుందన్నారు. వ్యాపారాలు పక్కన పెట్టి ఖమ్మంలో, పాల్వంచలో అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాలు, ప్రజా సేవ చేస్తానని ప్రకటించారు. దేనికైనా టైం ఉంటదని, మన టైం స్టార్ట్ అయిందన్నారు. అందరూ కష్టపడ్డారు ఫలితాలు ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నాయని, సైలెంట్ ఓటింగ్ జరిగిందన్నారు.

పీఎంవో నుంచి కాల్ వచ్చింది..

ఎన్నికల సందర్భంగా బిజెపికి ఖమ్మంలో పెద్ద ఊపు వచ్చిందని ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి కూడా ఫోన్ వచ్చిందని తెలిపారు. ప్రతి పక్షాలు పెద్ద ఎత్తున ధనం ఖర్చు పెట్టాయన్నారు. ఖమ్మం పార్లమెంట్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ.. మీరంతా ఎంపీ అభ్యర్థులేనని పార్టీ అభ్యర్థి అనడంతో ప్రతి ఒక్కరు పట్టుదలతో పని చేశారని ప్రశంసించారు. ధర్మానికి, అధర్మానికి, నీతికి అవినీతికి మధ్య ఈ ఎన్నికలని తాండ్ర తెలిపారని అన్నారు. అంతేగాక తాను ఖమ్మం ప్రజలను నమ్ముకున్నాను.. కాంగ్రెస్, బీఆర్ఎస్ డబ్బు సంచులు నమ్ముకున్నారని తెలియజేశారని చెప్పారు. ఖమ్మం ప్రజలను నేను నమ్ముకున్నాను కాబట్టి నా వైపు నిలబడతారని వారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలతో అన్నారని గుర్తు చేశారు.

మందా కృష్ణా ఆదేశాలతో..
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సునీల్ మాదిగ మాట్లాడుతూ నిశ్శబ్ద విప్లవం జరిగిందన్నారు. గత ఎన్నికలకు భిన్నంగా బీజేపీ ఈ ఎన్నికలను పరిశీలిస్తే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయనే చందంగా ఉందన్నారు. బిజెపి గ్రాఫ్ భారీగా పెరిగిందన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందాకృష్ణ మాదిగ ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం నుంచే ప్రచారాన్ని ఉధృతం చేసి బిజెపికి తోడు, నీడగా నిలిచామన్నారు. తమ భవిష్యత్తు కోసం మాదిగ బిడ్డలందరూ బిజెపికి అండగా నిలిచారన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులు నేరెళ్ళ శ్రీనివాస్, శ్యామ్, సరస్వతి, విజయారెడ్డి, టీడీపీ నాయకులు హరీష్, పృథ్వి, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి మాచర్ల క్రాంతి, రాము తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News