Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Khammam: శీనన్న ఎన్నికలప్పుడే వచ్చే టైపు కాదు

Khammam: శీనన్న ఎన్నికలప్పుడే వచ్చే టైపు కాదు

పాలేరు నా సొంతిల్లు, చక్కబెట్టుకునే బాధ్యత నాది

శీనన్న ఎన్నికలప్పుడే వచ్చే టైపు కాదంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేస్తూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ప్రత్యర్థులకు బలమైన హెచ్చరికలు చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లకోసం వచ్చే టైపు మీ శీనన్న కాదు, ఇప్పుడు ఎన్నికలు లేవు, ఓట్లు అడగాల్సిన అవసరం లేదు. మీ ఆశీస్సులు, దీవెనలతో ఇక్కడి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిని అయిన నేను మీ సమస్యలెంటో నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కారించేందుకు వచ్చాను. మీరు నాకిప్పుడు ప్రతి వినతిని పరిశీలించి.. వాటిన్నింటిని వీలైనంత త్వరగా పరిష్కారింపజేసేందుకు కృషిచేస్తానని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

తిరుమలాయపాలెం మండలంలోని కొక్కిరేణి, ఎర్రగడ్డ, గోపాలపురం, తిమ్మక్కపేట, తాళ్లచెర్వు, బీరోలు, ఏలువారి గూడెం, బంధంపల్లి, బచ్చోడుతండా, సోలిపురం, రాజారాం, పైనంపల్లి, జూపెడ, కాకరవాయి, సుద్దవాగుతండా, ముజాహిద్ పురం, ఏనుకుంట తండా, మంగళిబండతండా, రఘునాథపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి ఇళ్లు, రేషన్ కార్డు, పెన్షన్లు, రోడ్లు, కరెంటు, డ్రైనేజీలు తదితర సమస్యల పై ఇచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి మంత్రి పొంగులేటి మాట్లాడారు.

ఆ వివరాలు ఆయన మాటాల్లోనే… “పాలేరు నా సొంతిల్లు… చక్కబెట్టుకునే బాధ్యత నాదే…. మీ ఇంటి పెద్దకొడుకుగా నన్ను భావించి… అత్యధిక మెజారిటీతో నన్ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి మంత్రిగా నాకు అవకాశం కలిగేలా సహకరించిన మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా… రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలో ప్రతీ నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు దక్కేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆ ఇంటి మంత్రిని నేనే కాబట్టి పాలేరు నియోజకవర్గంలోని అర్హులైన ప్రతీ ఒక్కరికీ మూడేళ్లలోపే ఇల్లు దక్కేలా చూస్తానని మీకు హామీ ఇస్తున్నా..! అదేవిధంగా ఏడాదిలోపే నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలు పూర్తిచేయిస్తా… తాగునీరు, సాగునీరుకి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాను. విద్యా, వైద్యం, ఆరోగ్యం ఇలా ఏ రకమైన సమస్య వచ్చినా తీర్చే బాధ్యత నాదం”టూ తన ప్రసంగాన్ని ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News