Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Kishan Reddy: 'బంగారు తెలంగాణ' అని చెప్పి, 'లిక్కర్ తెలంగాణ'గా మార్చిన కేసీఆర్

Kishan Reddy: ‘బంగారు తెలంగాణ’ అని చెప్పి, ‘లిక్కర్ తెలంగాణ’గా మార్చిన కేసీఆర్

కేసీఆర్ ది మాత్రం బంగారు కుటుంబం అయ్యింది

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని ప్రజలకు చెప్పి లిక్కర్ తెలంగాణ చేసిండని, వీధి వీధికి బెల్ట్ షాపులు ఇచ్చి ప్రజలను ఆర్థికంగా ఎదగకుండా చేస్తున్నాడని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. పాలమూరు పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో పేదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహా ర్యాలీ నిర్వహించారు. ఆర్ అండ్ బీ అతిధి గృహం నుండి క్లాక్ టవర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. భాహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ…కేసీఆర్ మీద, బీ ఆర్ ఎస్ పార్టీ మీద మండిపడ్డారు.ఈ రాష్ట్రంలో ఏ మార్పు వచ్చినా, ఏ పోరాటం వచ్చినా దానికి కేంద్ర బిందువు పాలమూరు అని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు బీజేపీ పార్టీ ని మర్చిపోరని చెప్పారు. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి బీజేపి ముందుంటుందని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం దేశం మొత్తంలో పేదల కోసం నాలుగు కోట్ల ఇండ్లు కట్టిందని తెలిపారు. ఇక్కడ మాత్రం ముఖ్య మంత్రి నిజాం నవాబ్ మాదిరి రాజభవనం కట్టుకున్నాడని, మరి పేదలకు ఎందుకు ఇండ్లు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ రెండు కుమ్మక్కు అయ్యాయని అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలం ఇచ్చాడని గుర్తు చేశారు. పేదల ఇండ్ల నిర్మాణం కోసం కేంద్రం వాటా ఇస్తాము అన్న కేసీఆర్ తీసుకోలేదని తెలిపారు. ఇప్పటికి తొమ్మిది ఏళ్ళు గడిచి పోయాయి కానీ ఏ ఒక్క పేదవాడికి ఇల్లు రాలేదని అన్నారు. ఇప్పటికి ఉమ్మడి రాష్ట్రము లో ఇచ్చిన రేషన్ కార్డులు మాత్రమే ప్రజలకు ఉన్నాయని అన్నారు. కనీసం పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వని అసమర్ధత ఈ కేసీఆర్ ది అని విమర్శించారు. దున్నపోతుల మాదిరి తెగ బలిసిన బారాస నేతల ఆటలు ఇక సాగవని ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఎన్నికలు వచ్చిన ప్రతి సారి మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, ఉద్యమ సమయంలో రాష్ట్రం వచ్చాక దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి మాట నిలబెట్టుకోకుండా దళిత జాతిని వెన్నుపోటు పొడిచాడని తెలిపారు.నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి ఏ ఒక్కటి నెరవేర్చడం లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల లో అధ్యాపకుల పోస్టులు కాళీ ఉన్నాయని చెప్పారు. గ్రూప్ వన్ పేపర్ లీకేజి ద్వారా కష్ట పడి చదివిన వాళ్ల ఆశలు ఆవిరి చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. 30 లక్షల నిరుద్యోగుల ఆకలి మంటలు కేసీఆర్ కు కనబడటం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని, వాళ్ళని మోసం చేసిన అసమర్తుడు కేసీఆర్ అని అన్నాడు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ ఏమైంది… రైతుల రుణ మాఫీ ఏమయ్యింది అని సూటిగా అడిగారు.రుణ మాఫీ చేయక పోవడం వలన రైతులకు నేడు బ్యాంక్ లు రుణాలు ఇవ్వడం లేదుని, 2018 లో ప్రతి రైతుకు ఉచిత ఎరువులు ఇస్తా అని చెప్పి వాళ్లను నిలువునా మోసం చేశాడని గుర్తు చేశారు. పావలా వడ్డీ రుణాలు ఎక్కడికి పోయాయని, బంగారు తెలంగాణలో ఏ ఒక్క కుటుంబం బంగారు కుటుంబం కాలేదని, కేసీఆర్ ది మాత్రం బంగారు కుటుంబం అయ్యిందని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం దోపిడీకి మారు పేరుగా నిలిచిందని అన్నారు. కేంద్రం వేల కోట్ల రూపాయల తో ఈ రాష్ట్రంలో జాతీయ రహదురులు నిర్మిస్తోందని, రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కేంద్రం నిధులు ఉన్నాయని పేర్కొన్నారు. 3 సంవత్సరాల నుండి పేదవాడికి ఉచిత బియ్యం ఇస్తున్న ఘనత తమదని అన్నారు. కేసీఆర్ కుటుంబం, వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యే లు తెలంగాణ లో వేల కోట్లు దోచుకున్నారని, భూములు, ఇసుక, మైన్స్ ద్వారా ఈ దోపిడీ నిరంతరం కొనసాగుతున్నదని చెప్పారు.

- Advertisement -

తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి తల మీద కేసీఆర్ అప్పు చేశాడని చెప్పారు. దళిత బందు ప్రతి ఒక్కరికి అన్నావు… మరి ఎంత మందికి ఇచ్చావు అని కేసీఆర్ ను అడిగారు. బీసీ బంధు ఆశతో బిసిలను మోసం చేస్తున్నాడని అన్నారు. గిరిజనుల రిజర్వేషన్ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ ఎస్, ఎమ్ ఐ ఎమ్ మూడు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని….ఇవి ఒకే గూటి పక్షులు అన్నారు. అయోధ్యలో రామ మందిరం, కామన్ సివిల్ కోడ్ ను ఈ మూడు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని తెలిపారు.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణ మాట్లాడుతూ…

రాష్ట్రంలో నియంత పాలన అంతం కావాలని, కేసీఆర్ గద్దె దిగే వరకు బీజేపీ పోరాఠం చేస్తోందని అన్నారు. పేదలకు ఇండ్లు ఇచ్చేవరకు పోరాటం చేస్తామని, బీజేపీ అధికారం లోకి వచ్చాక ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామని చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస యోజనతో దేశంలో పేదలకు ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు. కేసీఆర్ చెప్పిన మాయమాటలకు ప్రజలు మోసపోయారని, కేసీఆర్ సోయిదప్పి ఫామ్ హౌస్ లో పడుకున్నాడని ఘాటుగా విమర్శించారు. యువతకు ఉద్యాగాలు ఏమయ్యాయని, మళ్ళీ ఎన్నికలు వస్తున్న ఈ సమయంలో ప్రజలను మోసం చేయడానికి కొత్త కొత్త పథకాలు కేసీఆర్ తెస్తున్నాడని చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం నేడు అప్పుల రాష్ట్రం అయ్యిందని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకోవడం మాత్రమే పనిగా పెట్టుకున్నారని పాలమూరు లో ఉన్న మంత్రి మాటకు ముందు బీసీ అంటున్నాడు.. ఆయన ఇష్టం వచ్చిన విదంగా దోచుకుంటే ప్రశ్నించడం తప్పా…అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని అన్నారు. పట్టణంలో జరిగిన పనులలో ప్రతి పైసా కేంద్రం నిధులు మాత్రమే అని అన్నారు. స్థానిక మంత్రి ఊరి మధ్యలో ఉన్న ఎంతో చరిత్ర కలిగిన, ఉమ్మడి జిల్లాకు సేవలు అందించిన కలెక్టర్ కార్యాలయం ఆయన భూములు ఉన్న ప్రాంతంలో నిర్మించడం ఆయన ఆస్తుల విలువ పెంచుకోవడం కోసమే అని అన్నారు. పట్టణంలో ఉన్న అనేక ప్రభుత్వ స్థలాలు మంత్రి కబ్జా చేశాడని, ప్రభుత్వ భూములను లాక్కుని పేదలకు ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు. పేదలకు ఘత ప్రభుత్వాలు ఇచ్చిన భూమి పట్టాలు లాక్కొని వాళ్లకు కనీసం ఒక ఇల్లు కూడ ఇవ్వలేదని అన్నారు. పాలమూరులో నియంత పాలన జరుగుతుందని ఘాటుగా విమర్శించారు. ఈ రోజు ప్రతి ఒక్కరు ఈ మంత్రి వలన ఇబ్బందులు పడుతున్నారని, త్వరలో ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంతకు ముందు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, టీ ఆచారి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి పి చంద్రశేఖర్,రతంగా పాండు రెడ్డి, సుదర్శన్ రెడ్డి,పద్మజా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బురుజు రాజేందర్ రెడ్డి, ఎగ్గని నర్సిములు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News