Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Kollapur: చరిత్రలో నిలిచిపోయేలా పాలమూరు ప్రజాగర్జన సభ

Kollapur: చరిత్రలో నిలిచిపోయేలా పాలమూరు ప్రజాగర్జన సభ

ప్రియాంక సభకు 3 లక్షల మంది హాజరు

చరిత్రలో నిలిచి పోయే విధంగా ఈ నెల 30 న నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలమూరు ప్రజా ఘర్జన సభ ఉంటుందని ఏ ఐ సి సి కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎస్ ఏ సంపత్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా డి సి సి అధ్యక్షులు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డాక్టర్ మల్లు రవి, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్బంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంపత్ కుమార్, వంశీ కృష్ణ మాట్లాడుతూ…సాయంత్రం 3 గంటలకు సభ ఉంటుందని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది ఈ సభకు హాజరువుతున్నారని తెలిపారు.

- Advertisement -


కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ముఖ్య అతిధిగా వస్తున్నారని, మహిళా అభివృద్ధి కోసం ఇంతకు ముందెన్నడు లేని విదంగా మహిళా డిక్లరేషన్ చేయనున్నారని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు సమిష్టిగా పని చేస్తూ, ఈ సభ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం అవినీతి, అరాచక పాలనకు ప్రజలు చరమ గీతం పాడనున్నారని తెలిపారు. ఈ సభలో మహిళా డిక్లరేషన్, పార్టీలో చేరికలు, బి ఆర్ ఎస్ ప్రభుత్వం వైపల్యాలు ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఈ సభలో కొల్లాపూర్ నుండి జూపల్లి కృష్ణారావు, కొడంగల్ నుండి గుర్నాథ్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుండి కూచుకుల్లా దామోదర్ రెడ్డి,వనపర్తి నుండి మేఘారెడ్డితో పాటు ఈ జిల్లాలో ఎవరూ ఊహించని విదంగా ముఖ్యమైన వాళ్ళు పార్టీలో చేరుతారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన విషయాలు 105 అబద్దాలు ప్రజలకు చెబుతామన్నారు.

గతంలో జరగని విధంగా ఈ సభ ఉంటుందని అన్నారు. గడిచిన 9 సంవత్సరాల నుండి తెలంగాణలో ప్రజాస్వామ్యం కూని అయ్యిందని,రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ఉంటుందన్నారు.అన్ని వర్గాల ప్రజలు ఈ సభకు రానున్నారని అన్నారు.తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని అందరికి అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అందరి చూపు కాంగ్రెస్ వైపు ఉందన్నారు. మునుపేన్నాడు చూడని అవినీతి,నియంత పాలన తెలంగాణ లో ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరు తమ తమ భాద్యత గా తీసుకోని ఈ సభకు వచ్చి విజవంతం చేయాలని ప్రజలను కోరారు.తెలంగాణ ను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పుకోవాలని అన్నారు. ఈ సమావేశం లో అన్ని జిల్లా ల డి సి సి అధ్యక్షులు,మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ….

గతంలో జరగని విధంగా ఈ సభ ఉంటుందని అన్నారు. గడిచిన 9 సంవత్సరాల నుండి తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ సభకు రానున్నారని అన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని అందరికీ అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అందరి చూపు కాంగ్రెస్ వైపు ఉందన్నారు. మునుపెన్నడూ చూడని అవినీతి, నియంత పాలన తెలంగాణలో ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ భాధ్యతగా తీసుకుని ఈ సభకు వచ్చి విజవంతం చేయాలని ప్రజలను కోరారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News