నిన్ను 33 జిల్లాలు ఎవడు చేయమన్నాడు అంటూ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ ధ్వజమెత్తారు. ఎన్నికల తరువాత హరీష్ రావుని కూడా బొక్కలో ఏస్తామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కోమటి రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం నీ అయ్యా జాగిరా? కేసీఆర్ నిన్ను వదిలిపెట్టేది లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని చేర్యాల పట్టణం లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు మునుగోడు శాసన సభ్యులు భువనగిరి పార్లమెంటు నియోజక వర్గ ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ , ఎమ్మెల్యే రాజలింగం, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నియోజక వర్గ కో ఆర్డినేటర్ భవాని రెడ్డి, టీపీసిసి అధికార ప్రతినిధి బాల లక్ష్మీ, చేర్యాల పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి , శ్రీరాములు, నర్సింగ్ రావు , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు , మాజీ జడ్పిటిసి కళావతి , యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఈఐ, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఎస్టీసెల్, బీసీ సెల్ ఎస్సీ సెల్, మైనార్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు.