Sunday, November 16, 2025
Homeపాలిటిక్స్KotamReddy: ఎన్కౌంటర్ చేస్తే తప్ప నా గొంతు ఆగదు: కోటంరెడ్డి

KotamReddy: ఎన్కౌంటర్ చేస్తే తప్ప నా గొంతు ఆగదు: కోటంరెడ్డి

35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తనకు అధికార పార్టీ దూరం అయితే వచ్చే ఇబ్బందులేంటో బాగా తెలుసని ఎమ్మెల్యే కోటంరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన ఈరోజు మరోసారి మీడియా ముందుకు వచ్చి చాలా పెద్ద వివరణలు ఇస్తూనే, భారీగా ఆరోపణలు చేయటం విశేషం. తన మనసు విరిగిపోయిందన్న ఆయన తన ఫోన్ ను ట్యాప్ చేయటంపై చాలా సీరియస్ గా స్పందించారు. తన అరెస్టుకు రంగం సిద్ధమనే ఆరోపణలు వస్తున్నాయని.. ఏ నిమిషమైనా తనను అరెస్టు చేసుకోవచ్చని, శాశ్వతంగా జైల్లో పెట్టినా తన గొంతు మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటుందని నిప్పులు చెరిగారు కోటంరెడ్డి. ఎన్ కౌంటర్ చేస్తే తప్ప తన కొందు ఆగదని ఆయన మాట్లాడటం సంచలనం సృష్టిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad