Saturday, October 12, 2024
Homeపాలిటిక్స్Kothi women's university to be named as Chakali Ilamma University: కోఠి...

Kothi women’s university to be named as Chakali Ilamma University: కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు

ఉమెన్స్ కమిషన్ లో ఐలమ్మ మనుమరాలు శ్వేత

చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..కోఠిలోని మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

ఐలమ్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని మా ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తామంటూ ఆయన ప్రకటించారు. దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాలను పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారని, చాకలి ఐలమ్మ స్పూర్తితో ఇందిరా గాంధీ భూ సంస్కరణలు తెచ్చారన్నారు. భూమి పేదవాడి ఆత్మగౌరవం..అందుకే ఇందిరమ్మ పేదలకు లక్షల ఎకరాలను పంచిపెట్టారన్నారు.

ధరణి ముసుగులో కొందరు పేదల భూములను గుంజుకునే కుట్ర చేశారని నిప్పులు చెరిగిన రేవంత్.. పేదల భూములను కాపాడేందుకే ఐలమ్మ స్పూర్తితో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News