Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్KTR: బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా కాంగ్రెస్‌ డిక్లరేషన్‌

KTR: బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా కాంగ్రెస్‌ డిక్లరేషన్‌

కాంగ్రెస్ లో ఆర్ధిక తీవ్రవాదం

కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా కాంగ్రెస్ డిక్లరేషన్ ఉందంటూ ఆరోపించారు. మరోవైపు ఎన్నికలు సమీపించేకొద్దీ..అధికార బీజేపీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఈరోజు.. బీ ఆర్ ఎస్ లో చేరారు మాజీ కాంగ్రెస్ నేత సింగిశెట్టి జగదీష్, ఆయనతోపాటు కాంగ్రెస్ బీజేపీ నుంచి పెద్ద ఎత్తున పలు స్థాయి నేతలు గులాబీ కండువ కప్పుకోవటం విశేషం.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో అరాచక రాజకీయం జరుగుతోందని, కాంగ్రెస్ లో ఆర్ధిక తీవ్రవాదం నడుస్తోందని, టికెట్లు అమ్ముకుంటున్నారని కేటీఆర్ భగ్గుమన్నారు. కెసిఆర్ ఓడించేందుకు పెద్ద యెత్తున కాంగ్రెస్ బీజేపీ నుంచి అగ్ర నేతలు వస్తున్నారని, తెలంగాణకున్న ఓకే ఒక గొంతుక కేసీఆర్ ను ఖతం చేసేందుకు ఢిల్లీ నుంచీ హైదరాబాద్ వస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, మళ్ళీ అధికారం లోకి వస్తాం వచ్చాక వారికి మరింత అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్‌ మైనార్టీ డిక్లరేషన్‌ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేలా ఉందన్న కేటీఆర్‌.. మైనార్టీల కులగణన అవసరం లేదన్నారు. మైనార్టీలను బీసీ కులగణనలో చేర్చుతామనడం సమంజసం కాదని, ఈ ప్రతిపాదనను కాంగ్రెస్‌ వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

మైనార్టీలను, బీసీలను నష్టపరిచే విధంగా కాంగ్రెస్‌ డిక్లరేషన్‌ ఉందని, బీసీల్లో చేర్చితే మైనార్టీలకు అందజేసే సంక్షేమం ఆగిపోతుందన్నారు. బీసీలకు, మైనార్టీలకు తగాదా పెట్టాలని కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందని, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఓట్ల కోసం కాంగ్రెస్‌ చిచ్చుపెట్టే రాజకీయం సాగుతోందని ఆరోపించారు.

రాజ్యాంగపరంగా మైనార్టీలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని, మైనార్టీల హక్కులు కొల్లగొట్టేలా కాంగ్రెస్‌ డిక్లరేషన్‌ కుట్ర తెరపైకి తెచ్చిందన్నారు. జనాభా గణన చేయాలంటే బీసీల లెక్కలు ముందు తేల్చాలని, బీసీల విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని కేటీఆర్ బీసీ-మైనారిటీ జపం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం హైలైట్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News