Friday, September 20, 2024
Homeపాలిటిక్స్KTR at Sirisilla సిరిసిల్ల సభలో కేటీఆర్ ను అభినందించిన కేసీఆర్

KTR at Sirisilla సిరిసిల్ల సభలో కేటీఆర్ ను అభినందించిన కేసీఆర్

రామారావును పొగుడుకుంటే నన్ను నేను పొగుడుకున్నట్లు ఉంటది

సిరిసిల్ల ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్ గారి ప్రసంగం – ముఖ్యాంశాలు :

- Advertisement -

• నా డెబ్బై ఏండ్ల జీవితంలో కనీసం ఒక వంద డెబ్బైసార్లు తిరిగిన జిల్లా సిరిసిల్ల.
• ఇక్కడ బంధుత్వాలు, బాంధవ్యాలు, ఆత్మీయతలు, ఎంతోమంది నా క్లాస్ మేట్స్ ఉన్న జిల్లా సిరిసిల్ల.
• అప్పర్ మానేరు నుంచి సిరిసిల్ల వరకు ఒక సజీవ జలధారగా మారింది.
• నలభై, యాభై ఏండ్ల కింద మానేరులో ఒక పాయలాగా బ్రహ్మాండంగా నీళ్లు కనిపించేవి.
• సమైక్య పాలనలో మొత్తం నాశనం అయింది.
• నా చిన్నతనంలో నీళ్లు, రైస్ మిల్లులు ఎన్నో ఉండేవి. సమైక్య పాలకుల దౌర్జన్యాలు పెరుగుతున్నా కొద్దీ అవన్నీ మాయమైనాయి.
• అప్పర్ మానేరు ప్రాజెక్టుతోనే తెలంగాణ ఉద్యమ సభ కూడా జరిపాం.
• అప్పర్ మానేరు మత్తడి ఎండాకాలంలో కూడా దూకుతావుంటే అద్భుతమైన ఆత్మసంతృప్తి కలుగుతావుంది.
• ఉద్యమ సమయంలో ఒక రోజు మధ్యరాత్రి ప్రొ.జయశంకర్, నేను ఒక మీటింగ్ ముగించుకొని సిరిసిల్లా గుండా వెళుతుంటే కార్ల హెడ్ లైట్లలో గోడలమీద ‘ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. చావులు పరిష్కారం కాదు..చావకండి’ అనే రాతలు మేమిద్దరం కండ్లకు నీళ్లు తీసుకున్నం.
• 70 ఏండ్ల స్వతంత్రంలో ఇలాంటి వాల్ రైటింగ్ లు చూడాల్సి వచ్చింది.. ఈ సమైక్య రాష్ట్రంలో మనకెందుకీ బాధలని బాధపడ్డాం.
• నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒకరోజు 7గురు చేనేత కార్మికులు చనిపోయినప్పుడు ఎంతో చలించి ఎవరూ చనిపోవద్దని రూ.50 లక్షల పార్టీ ఫండ్ ను ఇవ్వడం జరిగింది.
• కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే కావడం మీ అందరి అదృష్టం.
• చేనేత మంత్రిగా కూడా కేటీఆర్ యే ఉండటంతో అనేక మీటింగ్ లలో నాతో కొట్లాడి, అనేక రకాల పోరాటాలు చేసి చేనేత కార్మికులకు కావాల్సిన మరమగ్గాలు ఏర్పాటు, వాటి ఆధునీకరణకు డబ్బులు తెచ్చి చేనేత కార్మికుల పరిస్థితులు మార్చాడు.
• చేనేత కార్మికులను ఆత్మహత్యల పరిస్థితి నుంచి ఈరోజు చల్లగ బతికేందుకు కృషి చేసినందుకు కేటీఆర్ ను కూడా అభినందిస్తున్నాను.
• షోలాపూర్ ఏ విధంగా ఉందో సిరిసిల్లను కూడా అట్లాగే చేయాలని చేనేత వర్గానికే చెందిన ఎమ్మెల్సీ ఎల్.రమణ అడిగినట్లుగా మళ్లీ అధికారంలోకి రాగానే తప్పకుండా నేను, ప్రభుత్వం మీ వెంట ఉంటుందని హృదయపూర్వకంగా హామీనిస్తున్నాను.
• ప్రతి విషయన్నని నీచాతినీచంగా రాజకీయాలు చేసే చిల్లరగాళ్లు, కొందరు దుర్మార్గులు ఉంటరు. వాళ్లున్నరని చిన్నబోవద్దు. చేనేత కార్మికులు బతకాలె.
• చేనేత కార్మికులకు పని కల్పించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకొని బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు కానుకలుగా రాష్ట్రంలోని కోటి మంది పేదలకు కొత్త చీరలు, కొత్త బట్టలను అందజేస్తున్నది.


• మూడు, నాలుగు వందల కోట్ల రూపాయలతో సిరిసిల్లలో చేనేత కార్మికులకు పనిదొరకడమే గాకుండా పేదలకు కొత్త బట్టలు కూడా అందుతున్నాయి.
• కొంతమంది దుర్మార్గులు బతుకమ్మ చీరలను కూడా కాలబెట్టి రాజకీయం చేస్తున్నరు.
• బతుకమ్మ చీరలు కేవలం చీరల కోసమే కాదు..ఇక్కడ ఉరిబెట్టుకొని, సచ్చిపోయి, అప్పులపాలైన చేనేత కార్మికుల బిడ్డల కన్నీళ్లు తుడిచేటటువంటి ఒక గొప్ప మానవతా దృక్పథంతో చేపట్టిన పథకం ‘బతుకమ్మ చీరలు’.
• ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ శ్రీకారం చుడితే, ఇది కావాలని, చేనేత కార్మికులను కాపాడుకోవాలని కేబినేట్ ఒప్పుకొని చేసాం.
• ఓట్ల కోసం అడ్డగోలు అబద్ధాలు చెప్పకుండా మేనిఫెస్టోను చెప్పాం.
• కళ్యాణలక్ష్మి యాభైవేలతో ప్రారంభించి, తర్వాత డెబ్బై ఐదు వేలు, ఆ తర్వాత లక్ష వెయ్యి నూటపదహార్లకు పెంచుకున్నాం.
• పెన్షన్ ను మొదటి వెయ్యి రూపాయలు పెట్టుకొని, తర్వాత రెండు వేలకు పెంచుకున్నాం. ఇప్పుడు ఐదు వేలకు ప్రకటించుకున్నాం.
• మొదటి సంవత్సరంలో రెండు వేల పెన్షన్ ను మూడు వేలకు, తర్వాత సంవత్సరానికి ఐదొందలు పెంచుతూ ఐదు వేలకు పెంచుతాం.
• రైతుబంధు, ఇతర కార్యక్రమాలతో ఇవ్వాల మూడు కోట్ల టన్నుల వరి పండించి భారతదేశానికే అన్నం పెడుతున్నాం.
• సిద్ధిపేట నుంచి సిరిసిల్ల వరకు ఖాళీ జాగా లేకుండా పచ్చని పంట పొలాలతో వరి ఉంది.
• తెలంగాణ ప్రజలందరూ కూడా సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది.
• అనేకమైన అబద్ధాలతో, మోసపు మాటలు చెబుతూ ఆపదమొక్కులు మొక్కుతూ వచ్చే వాళ్లుంటరు.
• రామారావును పొగుడుకుంటే నన్ను నేను పొగుడుకున్నట్లు ఉంటది.
• రామారావు గుణగణాలు ఏందో నాకంటే మీకే ఎక్కువ తెలుసు.
• మీరూ, ఆయన కలిసి పనిచేస్తున్నరు కాబట్టి నేను రామారావును పొగిడే అవసరం లేదు.
• భవిష్యత్తులో గొప్ప విద్యా కేంద్రంగా, నీళ్లు కూడా వచ్చాయి కాబట్టి మంచి ప్రాంతంగా సిరిసిల్ల అన్ని హంగులు ఏర్పడే విధంగా నేను చర్యలు తీసుకుంటాను.
• 3 సంవత్సరాలు మేధోమథనం చేసి రైతుల భూములు క్షేమంగా ఉండాలని ధరణి పోర్టల్ తెచ్చుకున్నాం.


• ఏ మండలంలోని వారికి ఆ మండలంలోనే పావు గంటలో రిజిస్ట్రేషన్ అయిపోతావుంది.
• గతంలో రిజిస్ట్రేషన్ ఎలా ఉండె..ఇప్పుడు ఎలా ఉందో మీ కండ్ల ముందు ఉంది.
• కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణినీ తీసి బంగాళాఖాతంలో వేస్తామని పిసిసి అధ్యక్షుడు, సీఎల్పీ నాయకుడు, రాహూల్ గాంధీ కూడా ప్రకటించిండు. కాంగ్రెస్ పార్టీ గొడ్డలి మీ భుజమ్మీద పెట్టుకొని రెడీ గా ఉంది.
• మీ భూములపై అధికారాన్ని మీకే ఇచ్చినం.


• మీ బొటనవ్రేలు ముద్రలేకుండా మీ భూములను అమ్మే అధికారం గ్రామస్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎవరికీ లేకుండా చేశాం.
• పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయంటే ధరణియే కారణం.
• కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్లైతది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలె.
• తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్.


• ప్రతి ఇంటికి నల్లా నీరు ఇస్తున్నది ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ.
• కరెంటు 24 గంటలు ఉండాల్నా? లేక 3 గంటలు ఉండాల్నా?
• 60 కాంగ్రెస్ పాలనలో ఏనాడూ కరెంటు సక్కగ ఇయ్యలేదు.
• ధరణి పోతే.. మళ్లీ అధికారుల పెత్తనం


• చేనేతల కోసం కేటీఆర్ పోరాడుతున్నారు.
• సిరిసిల్లలో చేనేత కార్మికుల పరిస్థితి మార్చాం.
• ఇప్పుడు వేసవిలో కూడా అప్పర్ మానేరు మత్తడి దూకుతున్నది.
• చేనేత కార్మికులకు అండగా ఉంటాం.
• మంచి నాయకుడు, మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు కేటీఆర్ మీ దగ్గరే ఉన్నడు.
కేటీఆర్ ను దీవించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News