అసెంబ్లీలో బీఆర్ఎస్ నిత్యం ఏదో ఒక అంశంపై నిప్పులుచెరుగుతోంది. సభకు హాజరయ్యే సమయంలో రోజుకో డ్రెస్ లో, రోజుకో అంశాన్ని ఎత్తుకుని వస్తున్నారు బీఆఎస్ నేతలు. నిన్న బ్లాక్ డ్రెస్ లో వస్తే, ఈరోజు ఆటో డ్రైవర్ల ఖాకీ జాకెట్ వేసుకుని వచ్చారు. బీఆర్ెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటో నడుపుతూ అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా దృష్టిని ఆకర్షించారు.





