Friday, April 4, 2025
Homeపాలిటిక్స్KTR drove boat: స్వయంగా బోటు నడిపిన కేటీఆర్

KTR drove boat: స్వయంగా బోటు నడిపిన కేటీఆర్

మధ్య మానేరులో బోటింగ్ షికారు చేసిన మంత్రులు కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యాటక రంగాన్ని పటిష్టపరిచేందుకు పలు అభివృద్ధి పనులను తెలంగాణ పర్యాటక శాఖ ఇప్పటికే చేపట్టింది.అందులో భాగంగానే పర్యాటకులను ఆకట్టుకునేలా మధ్య మానేరు జలాశయం అందాలను వీక్షిస్తూ బోటింగ్ చేసేందుకు వీలుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటింగ్ యూనిట్ ను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. బోటింగ్ షికారులో వారి వెంట టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి,సెస్ చైర్మన్ చిక్కాల రామరావు, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News