Sunday, September 29, 2024
Homeపాలిటిక్స్KTR fire on coal mines auction: సింగరేణిని ప్రైవేటీకరణ చేసే పెద్ద కుట్ర

KTR fire on coal mines auction: సింగరేణిని ప్రైవేటీకరణ చేసే పెద్ద కుట్ర

మూడు రోజుల్లో భవిష్యత్ ప్రణాళిక

బొగ్గు గనుల వేలానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్.

- Advertisement -

కేటీఆర్ కామెంట్స్

🔹16 సీట్లు వచ్చిన టీడీపీ ఆంధ్రాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంది.

🔹కానీ కాంగ్రెస్ కు 8, బీజేపీకి 8 సీట్లు ఇస్తే వాళ్లే మన సింగరేణిని ఖతం చేస్తున్నారు.

🔹తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ మాత్రమే రక్షణ కవచమని కేసీఆర్ గారు వేల సార్లు చెప్పారు.

🔹దానికి గొప్ప ఉదాహరణే రేపు జరగబోయే బొగ్గు గనుల వేలం.

🔹మాకు 16 సీట్లు ఇవ్వండి, కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉంటామని కేసీఆర్ గారు చెబితే 16 సీట్లతో ఏం చేస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

🔹కానీ ఇప్పుడు మన బొగ్గు గనులను దుర్మార్గంగా వేలం బోయబోతున్నారు.

🔹గతంలోనే వేలం పాట ద్వారా గనులు కేటాయించవద్దని కేసీఆర్ గారు కేంద్రానికి ఉత్తరం రాశారు.

🔹కేసీఆర్ గారు ఉత్తరం రాసిన వెంటనే అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు కూడా సింగరేణికి కోల్ బ్లాక్ ల వేలం ఉండొద్దని కేంద్రానికి లేఖ రాశారు.

🔹కానీ అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు వచ్చిందని ఇప్పుడు కోల్ బ్లాక్ ల వేలానికి మద్దతు తెలుపుతున్నారు?

🔹కేసుల భయమా? రేవంత్ రెడ్డి గారికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా?

🔹ఒడిశాలో రెండు లిగ్మైట్ గనులను బీజేపీ ప్రభుత్వమే ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించింది.

🔹గుజరాత్ లోనూ రెండు పబ్లిక్ అండర్ టేకింగ్ సంస్థలకు 2015 సంవత్సరంలో ఐదు కోల్ బ్లాక్ లను కేటాయించారు.

🔹తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అభ్యంతరం తెలిపితే…అప్పుడు కూడా ఎలాంటి వేలం లేకుండా లిగ్మైట్ గనులను కేటాయించారు.

🔹కానీ తెలంగాణలో మాత్రం సింగరేణికి ఎందుకు గనులకు కేటాయించటం లేదు?

🔹దీని వెనుక సింగరేణిని ప్రైవేటీకరణ చేసే పెద్ద కుట్ర దాగి ఉంది.

🔹వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కూడా నష్టాల్లో ఉందంటూ ప్రైవేటీకరణ చేస్తామని చెబుతున్నారు.

🔹కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు క్యాప్టివ్ గని లేకుండా నష్టపోయేలా చేసిందే కేంద్ర ప్రభుత్వం.

🔹నష్టాల పేరుతో వైజాగ్ స్టీల్ ఎలా ప్రైవేటీకరణ చేద్దామనుకున్నారో…అదే విధంగా సింగరేణిని ప్రైవేటీకరణ చేద్దామనుకుంటున్నారు.

🔹సింగరేణిని కూడా ప్రైవేటీకరణ చేసేందుకే గనులు కేటాయించకుండా వేలం కార్యక్రమం ముందుకు పెట్టారు.

🔹ఎందుకు వేలం పాటలో కాంగ్రెస్ ప్రభుత్వం పాల్గొంటుందో చెప్పాలి?

🔹పదేళ్లు మా మెడ మీద కత్తి పెట్టిన మేము యాక్షన్ జరగనివ్వకుండా అడ్డుకున్నాం.

🔹సింగరేణి కార్మికుల సత్తా ఏంటో మనం ఉద్యమ సమయంలో చూశాం. అప్పుడు వాళ్లు సమ్మె చేస్తే దక్షిణ భారతం మొత్తం అంధకారంలోకి వెళ్లే పరిస్థితి వచ్చింది.

🔹అలాంటి సింగరేణిని కచ్చితంగా బీఆర్ఎస్ కాపాడుకుంటుంది.

🔹వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఎలా ఖతం చేశారో….సింగరేణిని కూడా అదే విధంగా ఖతం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ లు ప్రయత్నిస్తున్నాయి.

🔹కాంగ్రెస్, బీజేపీ లకు చెరో 8 ఎంపీలను ఇస్తే…సింగరేణిని నిట్ట నిలువునా ముంచే పని చేస్తున్నారు.

🔹కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్లు ఈ సాహసం చేయలే. ఈ విషయాన్ని బీజేపీ నేతలు కూడా చెప్పారు.

🔹సింగరేణిని కాపాడేందుకే కేసీఆర్ గారు గతంలో వేలం పాటలో పాల్గొన వద్దని చెప్పారు.

🔹మన రాష్ట్రం నుంచి ఒకరు కేంద్రమంత్రి అయితే మనకు ఏదైనా ప్రాజెక్ట్ రావాలె. కానీ మన కేంద్రమంత్రి గారు ఉన్నది అమ్మే పరిస్థితి తెచ్చారు.

🔹లోక్ సభ లో బీఆర్ఎస్ లేకపోవటంతోనే సింగరేణిని ఖతం పట్టించబోతున్నారు.

🔹బీజేపీ కి రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు ఇస్తే…వాళ్లు ప్రజలకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా?

🔹బీజేపీ నిర్ణయానికి సీఎం, డిప్యూటీ సీఎం గారు ఎందుకు వంత పాడుతున్నారు?

🔹రేపటి వేలంలో డిప్యూటీ సీఎం గారు ఎందుకు పాల్గొనబోతున్నారో చెప్పాలి.

🔹వేలం పాటలో పాల్గొనటమంటేనే దాన్ని ప్రైవేటీకరణ చేసే పనిని అంగీకరిస్తున్నట్లే.

🔹నాలుగు బొగ్గు గనులను కేటాయించే అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు కేటాయించటం లేదు.

🔹సింగరేణి మెడ మీద కేంద్రం కత్తిపెడితే ఆ కత్తికి సానా పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.

🔹గతంలో మేము పోరాటాలు చేసి సింగరేణిని కాపాడుకున్నాం.

🔹ఇప్పుడు కూడా సింగరేణిని మళ్లీ కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే.

🔹తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ మాత్రమే.

🔹మన బొగ్గును మనకు కేటాయించకపోవటం చాలా అన్యాయమైన పని.

🔹బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కేటాయించేందుకు కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి.

🔹మళ్లీ మా ప్రభుత్వం వస్తది. అప్పుడు ఈ నిర్ణయాన్ని సమీక్షించి అడ్డుకుంటాం.

🔹వేలంలో పాల్గొనబోయే ప్రైవేట్ కంపెనీలకు మేము ఇప్పుడే హెచ్చరిస్తున్నాం.

🔹ఇకనైనా బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలి.

🔹ఇక్కడున్న ఎంపీలు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడారా?

🔹రాష్ట్ర ప్రయోజనాలు, సింగరేణి ప్రయోజనాలు పట్టనట్లుగా కాంగ్రెస్, బీజేపీ లు వ్యవహరిస్తున్నాయి.

🔹సింగరేణిని ఖతం చేసే కుట్రను బీఆర్ఎస్ అడ్డుకుంటుంది.

🔹దీనిపై భవిష్యత్ కార్యాచరణనను కూడా రెండు, మూడో రోజుల్లో ప్రకటిస్తాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News