తన సొంత ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. అబద్ధాలు ఆధారంగా ఎన్నికలు గెలిచి.. అబద్ధాలతో పరిపాలన చేస్తామంటున్నారని ఆయన ఆరోపించారు. అబద్దాలతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అదే ప్రాపగండను మరోసారి తెలంగాణపై ప్రయోగించాలని చూస్తుంది తిప్పికొడదామంటూ ఆయన ప్రెస్ మీట్ లో పిలుపునిచ్చారు.
వందరోజుల్లో హామీలు అమలు చేయకుంటే బొంద పెట్టే దిశగా పని చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని తెప్పికుంటే ప్రజలను ఓటు అడగాలని ప్రజలను కోరుతామన్నారు. కేవలం పార్లమెంట్ మాత్రమే కాకుండా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేస్తామన్నారు కేటీఆర్.
తెలంగాణ సాధించిన విజయాలను వైఫల్యాలుగా చిత్రీకరించే ప్రయత్నంచేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అన్న కేటీఆర్.. వ్యవసాయానికి వెన్నుదన్నుగా కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులను కూడా విఫలముగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేవలం కేసీఆర్ పైన వ్యతిరేకతతో తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టేలా ప్రవర్తిస్తున్నారన్నారు.
గత పది సంవత్సరాలు గా తెలంగాణను పుట్టుకతో సహా అవమానించిన నరేంద్ర మోడీనీ, భారతీయ జనతా పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో అడ్డుకుంటామన్నారు. మత విద్వేషం తప్ప ఒక మంచి పని చేయని భారతీయ జనతా పార్టీతో పోరాడాలంటే కెసిఆర్ లాంటి బలమైన నాయకుడు కావాలన్నారు కేటీఆర్.