జగిత్యాలతో బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కేటీఆర్ కామెంట్స్
🔹కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోంది.
🔹 ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ హాయాంలోని కాంగ్రెస్ పార్టీ.
🔹2004 లో మనతో పొత్తు పెట్టుకొని మన 26 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకునే పని చేసింది.
🔹అయినా సరే 2014లో ఇదే కాంగ్రెస్ తో కొట్టాడి కేసీఆర్ ఆధ్వర్యంలో మనం తెలంగాణ తెచ్చుకున్నాం.
🔹2014 లో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది మీరంతా చూశారు.
🔹తెలంగాణ ను నడిపియ్యలేకపోతున్నారని చెప్పేందుకు, ప్రభుత్వం స్థిరంగా లేదని సర్కార్ ను పడగొట్టే ప్రయత్నం చేశారు.
🔹ఆ పరిస్థితుల్లో రాజ్యాంగ బద్దంగా మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు మన పార్టీలో చేరారు.
🔹 రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా మనం వ్యవహరించ లేదు.
🔹అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరినప్పడు ఇదే రేవంత్ రెడ్డి వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు.
🔹రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పాలె? ఎవరిని రాళ్లతో కొట్టాలే? ఎవరు పిచ్చి కుక్క?
🔹ఇప్పుడు రేవంత్ రెడ్డిని కొట్టాలా? ఇక్కడి ఎమ్మెల్యే సంజయ్ ను కొట్టాలా?
🔹రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీవు మగాడివైతే నువ్వు తీసుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపియ్.
🔹వాళ్లను మళ్లీ గెలిపించుకుంటే నువ్వు దమ్మునోడివి.
🔹ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు. రాహుల్ గాంధీ ఏమన్నాడో కూడా వినాలె.
🔹ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే ఆటోమేటిక్ గా సభ్యత్వం రద్దు అయ్యేలా చేస్తామని హైదరాబాద్ లోనే చెప్పిండు.
🔹పాంచ్ న్యాయ్ పేరుతో ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో కూడా పెట్టిండు.
🔹కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తుందేమెమిటీ ప్రజలు గుర్తించాలె.
🔹వాళ్ల పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి కూడా ఇదే అంశంపై సొంత పార్టీ పై విమర్శలు చేశాడు.
🔹బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
🔹బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. మూడోసారి మూడో వంతు సీట్లలో గెలిచింది.
🔹14 సీట్లలో కొద్ది తేడాతో మాత్రమే ఓడిపోయింది.
🔹ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు ?
🔹మోడీ కావాలా? వద్దా? అన్నట్లుగా ప్రచారం చేశారు.
🔹దీంతో ఐతే ఎన్డీయే, ఇండియా కూటమి లో లేని పార్టీలకు ఇబ్బంది జరిగింది.
🔹ఒక్క బీఆర్ఎస్ కు మాత్రమే కాదు. ఏ కూటమిలో లేని సీపీఎం, వైఎస్ఆర్ సీపీ, బీజేడీ, అన్నాడీఎంకే, బీఎస్పీ, అకాలీదల్ లకు కూడా ఎదురుదెబ్బ తగిలింది.
🔹రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇప్పుడిప్పుడే ఒక్కో అంశం అర్థమవుతోంది.
🔹రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చిన బీఆర్ఎస్ ను బద్నాం చేశాడు.
🔹ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు.
🔹కానీ ఇప్పుడు అసలు విషయం తెలుస్తోంది. ఓయూ విద్యార్థులు నిరసన మొదలు పెట్టారు.
🔹మోతీలాల్ అనే విద్యార్థి దీక్ష చేస్తుంటే పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీని తరిమి కొట్టారు.
🔹ఈ ఆరునెలల్లో ఏమీ అభివృద్ధి జరిగింది. అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు.
🔹మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీఆర్ఎస్ గెలుస్తుంది.
🔹తెలంగాణ తెచ్చింది. తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్. ఇది చరిత్ర. ఈ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు.
🔹ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టే విధంగా హామీలు ఇవ్వటం కారణంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
🔹డిసెంబర్ 9 రుణమాఫీ అన్నారు. ఏడు నెలలు అయ్యింది. టైమ్ పాస్ చేస్తున్నారు.
🔹వృద్ధులకు 4 వేలు, రైతులకు రైతు భరోసా రూ. 15000, మహిళలకు రూ. 2500 అంటూ నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు.
🔹ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు.
🔹వాటికి సంబంధించి ప్రజలు నిలదీస్తే… కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనే ముసలం పుడుతుందని రేవంత్ భయపడ్డాడు.
🔹అందుకే ఎమ్మెల్యేలను గొర్రెలు, బర్రెల మాదిరిగా డబ్బులు పడేసి కొని తన దొడ్లో కట్టేసుకుంటున్నాడు.
🔹ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసేందుకు ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతుండు.
🔹ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకుంటూ బీఆర్ఎస్ ఖతం అయిపోయిందంటూ పుకార్లు పట్టిస్తున్నాడు. ఆయన మీడియాలో ఏదేదో కథనాలు రాయించుకుంటున్నాడు.
🔹కానీ బీఆర్ఎస్ మళ్లీ గెలవటం ఖాయం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కడతారు.
🔹జగిత్యాల కార్యకర్తలను చూస్తే సంతోషంగా ఉంది. జగిత్యాలకు పట్టిన శని పోయిందన్నట్లుగా ధైర్యంగా కనిపిస్తున్నారు.
🔹కష్టాలు వచ్చినప్పుడే నాయకుల విలువ తెలుస్తుంది.
🔹జగిత్యాలలో కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా.
🔹గాలికి కొట్టుకుపోయేటివి గడ్డిపోచలే. గడ్డపారాలు కొట్టుకుపోవు. ఇక్కడ ఎమ్మెల్యే గడ్డిపోచలాంటి వ్యక్తి.
🔹కవితక్క సహా మీరందరూ కష్టపడితే ఆయన ఎమ్మెల్యే అయ్యిండు
🔹కానీ దొంగలల్లా కలిసి పోయిండు. రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతుకుల కోసం పోయిండు.
🔹కుండ పగిలితే పగిలింది. కానీ కుక్క బుద్ది తెలిసిందన్నట్లుగా మీ ఎమ్మెల్యే బుద్ది తెలిసింది.
🔹అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినా అని సంజయ్ అంటున్నాడు.
🔹జగిత్యాల జిల్లా రద్దు చేస్తా అన్నందుకు పోయినవా? మెడికల్ కాలేజ్ రద్దు చేస్తా అన్నందుకు పోయినవా? 4500 డబుల్ బెడ్ రూమ్ లు రద్దు చేస్తా అన్నందుకు పోయినవా?
🔹కేవలం తన వియ్యంకుడికి బిల్లులు, సొంత క్రషర్ కోసం మాత్రమే ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి పోయిండు.
🔹దమ్ముంటే డాక్టర్ సంజయ్ రాజీనామా చేసి ముందుకు రావాలె.
🔹ఇప్పుడు జగిత్యాల ప్రజలు చేయాల్సింది ఒక్కటే సంజయ్ మళ్లీ ఓట్ల కోసం వస్తే ఉరికించి కొట్టాలె.
🔹గాలికి గడ్డపారాలు కొట్టుకుపోవు. బీఆర్ఎస్ కార్యకర్తలు బలంగా ఉన్నారు. మళ్లీ మన పార్టీ గెలవటం ఖాయం.
🔹జగిత్యాల లో సంజయ్ కు ఒక్క ఎంపీటీసీ సీటు కూడా జీవన్ రెడ్డి ఇవ్వనియ్యడు.
🔹జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు.
🔹బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
🔹మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయం. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం.