Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్KTR @ Kodangal: నరేందర్ రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా మంత్రి పదవి...

KTR @ Kodangal: నరేందర్ రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా మంత్రి పదవి ఇప్పిస్తా

కేటీఆర్ హై ఓల్టేజ్ ప్రసంగం

కొడంగల్ లో కే టీ ఆర్ కామెంట్స్ :
👉 నరేందర్ రెడ్డిని గెలిపిస్తే..కేసీఆర్ కాళ్ళు పట్టుకొని అయినా సరే నరేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇప్పిస్తా..
👉 ఈ ప్రజలను చూసి రేవంత్ రెడ్డి 15 తేదీన నామినేషన్ వాపస్ తీసుకుంటాడు.
👉 9 నర సంవత్సరాలలో k c r తెలంగాణ రాష్ట్రన్ని ఎంతో అభివృద్ధి చేసారు..
👉 కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. కరెంటు పోయింది.
👉 ఆ రాష్ట్ర ప్రజలు ఎంతో బాధ పడుతున్నారు..
👉 రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో కొడంగల్ పేరును నాశనం చేసిండు..
👉 రేవంత్ రెడ్డి k c r కు సవాల్ విసురుతున్నాడు.. రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే.. తెగ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడ కొడుతుంది.
👉 జనంలో ఉండే నాయకుడు కావాలా? జైలుకి వెళ్లే నాయకుడు కావాలా?
👉 రేవంత్ రెడ్డి కి k c r అక్కర్లేదు.. మా నరేందర్ రెడ్డి చాలు.
👉 నరేందర్ రెడ్డి గెలిచిన తరువాత పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకం ద్వారా సాగు నీటిని అందిస్తాం.

- Advertisement -

👉 రేవంత్ రెడ్డి సర్పంచులను, m p t c లను కొంటుండొచ్చు కానీ ప్రజాలను కొనలేరు..
👉మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు గ్రామలకు వచ్చి ఓట్లు వేయమని అడుగుతారు. నమ్మి మోసపోకండి.
👉సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా నెలకు 3000 ఇస్తం.
👉 ఆసరా పెంక్షన్ 5000 ఇస్తాం..
👉 సిలిండర్ ను 400 కు ఇస్తా.
👉 పొలం లేని రైతులకు 93 లక్షల తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి. 5 లక్షల k c r భీమా ఇస్తాం.


👉 తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి దొడ్డు బియ్యం బదులు.. సన్న బియ్యం అందిస్తాం..
రైతు బంధు 16000 వేలు అందిస్తాం..
👉 మద్దూర్ మండలాన్ని మునిసిపాలిటీగా చేస్తా..
👉 కొడంగల్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటా..
👉దీనితో నరేందర్ రెడ్డి చెప్పిన ప్రతి పనిని నేను చేస్తా.. మీరు మాత్రం బ్యాలెట్ బాక్స్ లో గుద్దుడు గుద్దితే.. రేవంత్ రెడ్డి పారిపోవాలి..


👉 తెలంగాణకు ఒకే ఒక్క గొంతు నొక్కేందుకు.. ఢిల్లీ నుండి రాహుల్ గాంధీ.. మోదీ అంట… ఖర్గే అంట.. ప్రియాంక గాంధీ అంట గుంపులు.. గుంపులుగా వస్తున్నారు…
👉రేవంత్ రెడ్డి అంటున్నాడు సోనియామ్మ తెలంగాణ ఇచ్చిండు అంటున్నాడు.. కాంగ్రెస్ వాళ్ళు అంటే చెప్పుతో కొట్టబుద్ది అవుతుంది..
👉ఎందుకంటె ఎంతో మంది యువకులు ప్రాణ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది…
రేవంత్ రెడ్డి బ్లక్ మెలర్.. రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ప్లాట్లు చేసి అమ్ముకుంటాడు..
రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్
👉 నీళ్లు కావాలా? కన్నీళ్లు కావాలా? కరెంటు కావాలా? కష్టాలు కావాలా?
👉 కరోనా కష్ట కాలంలో కూడా నరేందర్ రెడ్డి అందుబాటులో ఉన్నాడు.. కనీసం ఫోన్ లో కూడా అందుబాటులో ఉండని రేవంత్ రెడ్డి కావాలా?
నవంబర్ 30 నా బ్యాలెట్ బాక్స్ తెరిస్తే కొడంగల్ లో కాంగ్రెస్ నాయకుల దుమ్ము దులపాలి అంటూ కేటీఆర్ ప్రసంగం హై ఓల్టేజ్ తో సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News