Saturday, October 12, 2024
Homeపాలిటిక్స్KTR meets BRS BC leaders: బీఆర్ఎస్ బీసీ లీడర్లతో కేటీఆర్ భేటీ

KTR meets BRS BC leaders: బీఆర్ఎస్ బీసీ లీడర్లతో కేటీఆర్ భేటీ

తమిళనాడులో బీసీ లీడర్స్ టూర్..

భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షులు కే.టీ.రామారావు (KTR) పార్టీకి చెందిన బీసీ ప్రముఖులతో సమావేశమయ్యారు

- Advertisement -

తమిళనాడులో బీసీల సంక్షేమం, సముద్ధరణకు అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల అధ్యయనానికి పార్టీకి చెందిన బీసీ నాయకులు త్వరలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మంగళవారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు జోగు రామన్న,వీ.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, బూడిద భిక్షమయ్య గౌడ్ తదితరులతో భేటీ అయ్యారు.

బీసీ నాయకులతో కేటీఆర్ పలు అంశాలపై లోతుగా చర్చించి, పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో తెలంగాణ బీసీ కమిషన్ మాజీ సభ్యులు జూలూరు గౌరీశంకర్, ఆంజనేయులు గౌడ్,శుభప్రద పటేల్, ఉపేంద్రాచారి,కిశోర్ గౌడ్, నాయకులు చిరుమళ్ల రాకేష్,గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాజారాం యాదవ్, రవీందర్ సింగ్,ఆలకుంట హరి,వొడపల్లి మాధవ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News