Friday, July 5, 2024
Homeపాలిటిక్స్KTR @ Moinabad: మచ్చలేని నాయకునికి ఓటెయ్యండి

KTR @ Moinabad: మచ్చలేని నాయకునికి ఓటెయ్యండి

మొయినాబాద్ లో కేటీఆర్

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొయినాబాద్ మండలంలో రోడ్ షోలో పాల్గొన్నారు. చేవెళ్ల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కాలె యాదయ్యను బలపరుస్తూ… జిల్లా నేతలు ఎంపీ రంజిత్ రెడ్డి, మంత్రులు మహేందర్ రెడ్డి కార్తిక్ రెడ్డి కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…. బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక రంగాల్లో రాష్టాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు సంక్షేమాన్ని పంచిందన్నారు. ముఖ్యంగా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ శంకర్పల్లి మండలాల్లో వస్తు తయారీలు చేసే అంతర్జాతీయ కంపెనీలు తెచ్చామని తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు. ప్రజలు అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి ఓటెయ్యాలన్నారు. త్రిబుల్ వన్ జీవో ని పూర్తిగా ఎత్తేసామని కానీ కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయని అవి కూడా తొలగిస్తామని చేవెళ్ల నియోజకవర్గం ప్రజలకు పూర్తి న్యాయం జరిగేంత వరకు కృషి చేస్తామని అన్నారు. ఎటువంటి మచ్చలేని యాదన్నకు ఓటు వేసి గెలిపించాలన్నారు. నా మీద 19 కేసులు ఉన్నాయి మరొకరి మీద 30 కేసులు ఉన్నాయి ప్రత్యర్ధులు చెప్పుకుంటున్నారని అవి ఏమైనా అవార్డుల అని ఎద్దేవా చేశారు కాలే యాదయ్య. తొమ్మిదేళ్లుగా అందిస్తున్న సంక్షేమాన్ని చేస్తున్న అభివృద్ధిని టిఆర్ఎస్ ప్రభుత్వం మరింత పెంచే కార్యచరణ చేసిందన్నారు. అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ లేని పథకాలతో ప్రజలను మభ్యపెడుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తన సొంత వారినే హత్య చేసి జైల్లో ఉన్న నేర చరిత్ర కలిగిన వ్యక్తి అన్నారు. ప్రశాంతంగా ఉన్న చేవెళ్ల లో కష్టం నమ్ముకున్న రైతులు పూల అమ్ముకునే పరిస్థితి ఇప్పుడు ఉందని, మచ్చలేని వ్యక్తి కాలె యాదయ్యను సంక్షేమాన్ని అభివృద్ధిని చూసి ఆలోచించి ఓట్లు వేయాలన్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు ఓట్లు వేసి ప్రశాంతమైన చేవెళ్లలో శాంతి భద్రతులకు విఘాతం కలుగుతుందన్నారు. మచ్చలేని మనిషి కాలె యాదయ్యకు ఓటు వేయాలని కేటీఆర్ అన్నారు.

- Advertisement -

ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య మాట్లాడుతూ…. అభివృద్ధిని చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సొంత తన బామ్మర్దిని హత్య చేసి పారిపోయాడన్నారు. చేవెళ్ల నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని కల్మషం లేని రైతులు కూరగాయలు పువ్వులు పండించి అమ్ముకుంటారని నేరస్తులకు ఓట్లేసి గెలిపిస్తే రక్తపాతం అవుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నేరచరిత్ర అందరికీ తెలిసిందేనన్నారు. నియోజకవర్గ శాంతిభద్రతలు సంక్షేమాన్ని అభివృద్ధిని ఆలోచించి టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్ రెడ్డి, మొయినాబాద్ మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు, ప్రజలు బిఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News