Thursday, November 21, 2024
Homeపాలిటిక్స్KTR at Mulkanur: జనసంద్రమైన ముల్కనూర్

KTR at Mulkanur: జనసంద్రమైన ముల్కనూర్

దరిద్రానికి నేస్తం హస్తం, అది మనకొద్దు

భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో కార్యక్రమంలో హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్, హుస్నాబాద్ బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ పెద్దిరెడ్డి లతో కలిసి పాల్గొన్నారు. ఈ రోడ్ షోకు డప్పుచప్పులతో, కోలాటాలతో, బతుకమ్మలు, బోనాలతో, ఒగ్గుడోలులతో, మహిళలు, యువకులు, వృద్ధులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ మాట్లాడుతూ 2014, 2018 లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. మూడవసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను ఆశీర్వదించండి.

- Advertisement -

ఈ నెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు ఈవీఎంపై నాలుగో నెంబర్ ఉంటుందని ఓటేసి ఆశీర్వదించాలని వేలాదిగా తరలివచ్చిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి కోరారు. సతీష్ కుమార్ కు మద్దతుగా రోడ్ షో కు హాజరైన ప్రజలందరూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై సతీష్ కుమార్, కారు గుర్తుకే మన ఓటు అని నినాదాలతో హోరెత్తించారు. హుస్నాబాద్ బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని ప్రతిపక్ష పార్టీ నాయకుల మాటలు విని మోసపోవద్దని ప్రజలందరూ కారు గుర్తుకు ఓటెయ్యాలని సతీష్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ వేలాదిగా తరలివచ్చిన ప్రజలందరికీ పేరుపేరునా నమస్కారములు తెలియజేస్తూ హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున 9076 కోట్ల రూపాయలు నిధులు తెచ్చారని, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చాడు మళ్లీ అతి భారీ మెజారిటీతో గెలిపించి మీ మార్కులన్నీ ఆయనకే వేయాలి అని ప్రజలను కోరారు.

సతీష్ అన్న మంచివాడు నాకు పెద్దన్నలాంటి వాడు ఆయన ఏది అడిగినా కేసీఆర్ నేను కాదనలేదు. అవసరమైన నిధులు ఇచ్చాం. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేశాడు. హుస్నాబాద్ కు కరువును దూరం చేసిండు. భూనిర్వాసితులకు దేశంలో ఎక్కడా ఇవ్వనటువంటి అత్యధిక పరిహారం ఇప్పించాడు. ఆయనను గెలిపించుకోండి ఇంకా అభివృద్ధి చేసి చూపెడతాడు అని కేటీఆర్ ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని ఇప్పుడు అడుగుతున్నారు. 11 సార్లు ఛాన్స్ ఇచ్చాము దేశాన్ని ఏం ఉద్ధరించారు అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు ఉండేది కాదు కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, వ్యవసాయం నడవలేదు. పరిశ్రమలు మూతపడ్డాయి. ఇన్వర్టర్లు వాడినం. ఇప్పుడు మూడు గంటల కరెంటు చాలంటున్నారు. ఎద్దు, ఎవుసం తెలవనోడు పిసిసి అధ్యక్షుడు అయ్యాడని దుయ్యబట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు వేస్ట్ అంటాడు. బట్టి విక్రమార్క ధరణి వద్దు పట్వారి వ్యవస్థ రావాలంటాడు. వాళ్ల నాయకుడు రాహుల్ గాంధీకి క్లబ్బులు పబ్బులు తప్పించి ప్రజల బాధలు తెలియదు.వారిని నమ్మవద్దని ప్రజలకు హితవు పలికారు. బిజెపి పార్టీ, ప్రధాన మంత్రి మోడీ నల్లదనం తెస్తాను. ప్రజలందరికీ పంచుతానన్నాడు నల్లధనం మాటేమో కానీ ప్రియమైన ప్రధాని ప్రతిదీ ఫిరం చేశాడు. ఉప్పు,పప్పు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచిండు మోడీ అని కేటీఆర్ విరుచుకుపడ్డారు. కేసిఆర్ ప్రవేశపెట్టిన 2023 మేనిఫెస్టో ప్రకారం సౌభాగ్య లక్ష్మి, 400కే గ్యాస్ సిలిండర్, రైతుబంధు 16 వేల రూపాయలు, కేసిఆర్ బీమా, రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యమే ఈ జనవరి నుండి అందజేస్తామని, కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని కేటీఆర్ తెలిపారు. గాడిదలకు గడ్డి వేసి ఆవు పాలు పిండి నట్టు ప్రతిపక్ష పార్టీ నాయకుల మాయ మాటలు నమ్మి గోస పడవద్దని పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కారు గుర్తుకే ఓటేసి మళ్లీ సతీష్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ ప్రజలను కోరారు ప్రజలు తమ కరతాల ధ్వనులతో అభిమానం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి డాక్టర్ సుధీర్ కుమార్, ఎంపీపీ జక్కుల అనిత రమేష్, జడ్పిటిసి వంగ రవి, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మార్పాటి మహేందర్ రెడ్డి, మండలంలోని ఎంపీటీసీలు మండల సురేందర్ అప్పని పద్మ, బొల్లంపల్లి రమేష్, గ్రామ సర్పంచ్ మాడుగుల కొమురయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాజిరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శనిగరపు సదానందం సైదాపూర్ ,ఎల్కతుర్తి భీమదేవరపల్లి మండలాల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News